
అయితే తాజాగా ఒక రాష్ట్ర సీఎం పై నరేంద్ర మోదీ కన్నెర్ర చేశారు... ఇంకేముంది ఆ రాష్ట్ర సీఎం కుర్చీకి ఎసరు వచ్చింది. ఏ క్షణం అయినా సదరు సీఎం రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. మామూలుగా చాలా రాష్ట్రాల మంత్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భయపడి వారిని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మాత్రం బీజేపీ తీరుపై మాట్లాడిన పాపానికి ఆయన్నే టార్గెట్ చేశారు నరేంద్ర మోదీ. ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై అనర్హత వేటు వేయాలని జార్ఖండ్ గవర్నర్ కు రిపోర్ట్ ఇచ్చింది.
ఇందుకు ఆయనపై అధికార దుర్వినియోగం అన్న అంశాన్ని బనాయించారు. మైనింగ్ లీజు ను తన సొంతానికి తీసుకోవడం అన్న కారణాన్ని చూపుతూ జార్ఖండ్ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో, ఎన్నికల సంఘం వెంటనే రిపోర్ట్ రెఢీ చేయడం వెనుక నరేంద్ర మోదీ ఉన్నారని తెలుస్తోంది. ఇక జార్ఖండ్ గవర్నర్ కూడా వెంటనే రిపోర్ట్ ను తీసుకుని సీఎం పై ఎటువంటి చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అడగడం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇక ఝార్ఖండ్ ప్రభుత్వం కుప్ప కూలడంతో పక్కా .. ఇలా బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం పై నరేంద్ర మోదీ కన్నెర్ర చేసి భూకంపం వచ్చేలా చేశారు. బహుశా ఈ సంఘటన బీజేపీ వ్యతిరేక సీఎం లకు ఒక గుణపాఠం అని చెప్పాలి.