
ఇక ఇటీవలే మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా ఉంది ఆమె. విద్యార్థులకు మిగతా టీచర్లు ఎలా పాఠాలు చెబుతున్నారో అన్న విషయాన్ని గమనిస్తూ ఉండాలి. కానీ 441 / 4 గణిత సమస్య పరిష్కరించడంలో ఆమె విఫలమైంది. దీంతో ఆమె జ్ఞానం చూసి కంగుతిన్న కలెక్టర్ ఆమెనూ చివరికి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కలెక్టర్ గిరీష్ కుమార్ మిశ్రా పాఠశాలలో తనిఖీ చేశారు.
ఈ క్రమంలోనే స్కూల్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో.. టీచింగ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు పిల్లలతో కొద్దిసేపు కలెక్టర్ ముచ్చటించారు. ఈ క్రమంలోనే బ్లాక్ బోర్డు పై 411 సంఖ్యను నాలుగుతో భావించమని పిల్లలకు సూచించాడు. స్టూడెంట్స్ తప్పుగా రాయడం తో అక్కడే ఉన్న క్లాస్ టీచర్ ప్రధానోపాధ్యాయురాలు స్పందిస్తూ లాక్ డౌన్ కారణంగా చాలా మంది పిల్లలు గణితం మర్చిపోయారని.. మళ్ళీ వారికి తిరిగి బోధిస్త అంటూ చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలిని లెక్కలు పరిష్కరించమని కలెక్టర్ ఆదేశించారు. లెక్క పరిష్కరించడంలో ఆమె కూడా విఫలమైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆమెను విధుల నుంచి తొలగించారు.