
ఇదిలా ఉంటే ఓటింగ్ రోజు కొన్ని మీడియా చానెళ్లు పలు ఓటింగ్ కేంద్రాల బయట ఓటు వేసిన అక్కచెల్లెమ్మలను ఆపి మరీ ఎన్నిక గురించి మాట కలిపారు. ఆ ప్రయత్నంలోనే వారిని ఎవరికీ ఓటు వేశారు ? ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారు ? ఒక్క ఓటుకు ఎంత అమౌట్ ఇచ్చారు ? బంగారం ఏమైనా ఇచ్చారా ? అన్న పలు ప్రశ్నలను సంధించారు. మాములుగా గతంలో ఓటు ఎవరికి వేశారు అని కానీ మరియు ఓటుకు ఏ పార్టీ ఎంత ఇచ్చారు అన్న విషయం కానీ బహిరంగంగా చెప్పేవారు కాదు. కానీ నేడు కాలం చాలా మారిపోయింది. మీడియా వారితో బహిరంగంగానే వాళ్ళు ఎవరికి ఓటు వేశారు ఏ పార్టీ గెలుస్తుంది మరియు ఏ పార్టీ ఎంత డబ్బు ఇచ్చింది అన్న విషయాలను చెప్పడంతో కొందరు అవాక్కవుతన్నారు.
ఇదే విషయం గురించి మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఘాటుగా స్పందించారు. కేవలం ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికకు కోట్లు డబ్బును బీజేపీ మరియు తెరాస పార్టీలు ఖర్చు చేయడం చాలా బాధాకరం అన్నారు. ఓటర్లను డబ్బులతో ఇబ్బందులకు గురి చేసి ఓట్లను వేయించుకున్నారు అంటూ మండిపడ్డారు. ఇందుకు ఓటర్లే సాక్ష్యం... ఎందుకు బీజేపీ మరియు తెరాస లు ఓటర్లకు డబ్బు పంచారు. ఈ ఎన్నికను వెంటనే రద్దు చేయాలి అంటూ ఐఏఎస్ మురళి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మరి ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఏ విధంగా తీసుకుంటుంది ? ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉందా అంటూ చర్చలు జరుపుతున్నారు.