రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్లు చేస్తున్న ఎల్లోబ్యాచ్ మొత్తానికి సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. అమరావతి నిర్మాణం విషయమై సుప్రింకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇదే కేసును విచారించిన హైకోర్టు ఆరుమాసాల్లో అమరావతి రాజధానిని నిర్మించేయాలని ఆదేశించింది. రాజధానిని అమరావతి నుండి కదిల్చేందుకు లేదన్నది.





హైకోర్టు తీర్పును  ప్రభుత్వం సుప్రింకోర్టులో చాలెంజ్ చేసింది. ఆ కేసే ఇపుడు విచారణ జరిగింది. ఈ నేపధ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. ఆరుమాసాల్లో రాజధానిని నిర్మించాలన్న ఆదేశాలు చెల్లవని చెప్పింది. అలాగే రాజధానిని ఎక్కడ నిర్మించాలి, అభివృద్ధి ఎలాచేయాలి ? వికేంద్రీకరణ చేయకూడదనే విషయాలపై హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించినట్లు సుప్రింకోర్టు అభిప్రాయపడింది. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ న్యాయస్ధానంది కాదని చెప్పింది. తాజాగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో రాబోయే తీర్పు ఎలాగ ఉండబోతోంది అనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. 





ప్రభుత్వం చేయాల్సిన పనిని హైకోర్టే చేస్తానంటే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు అని నిలదీసింది. అభివృద్ధి మొత్తాన్ని ఒకేచోట కేంద్రీకరిస్తానంటే ఎలాగ అంటు నిలదీసింది. తాజాగా  సుప్రింకోర్టు చేసిన  వ్యాఖ్యలు ప్రభుత్వం వాదనకు మద్దతుగా నిలబడేవే అనటంలో సందేహంలేదు. రాజధానిని అమరావతి నుండి కదిల్చేందుకు లేదని చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా, అమరావత జేఏసీ పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత గోలచేస్తున్నారో చూస్తున్నదే. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే కోర్టుల్లో కేసులువేసి నిర్ణయాన్ని అమలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.





చివరకు రాజధాని నిర్మాణంపై  విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదుకానీ తాజా వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వానికి మంచి జోష్ ఇచ్చేవే అనటంలో సందేహంలేదు. విచిత్రం ఏమిటంటే రాజధాని విషయమై ప్రభుత్వం చట్టం చేసేందుకు లేదని, అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు చేయకూడదని హైకోర్టు తీర్పుచెప్పింది. ఇక్కడే హైకోర్టు తీర్పుపై అందరిలోను సందేహాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఉన్నదే చట్టాలు చేయటానికైనపుడు ఇక్కడ చట్టం చేయకూడదని చెప్పటంపై చాలామంది ఆశ్చర్యపోయారు. ఇపుడు ఆ విషయాన్నే సుప్రింకోర్టు కూడా ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: