నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇది ఒక ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. గత రెండు సార్లు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ నాయకులు, మంత్రులు , ఎమ్మెల్యేలు మరియు ప్రజల దగ్గర తన యొక్క శ్రమతో ఎంతో గుర్తింపును పొందిన ఎమ్మెల్యే గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పేరుంది. మరో విషయం చెప్పాలంటే జగన్ అన్నా అతని ఫ్యామిలీ అన్నా ఇతనికి వీరాభిమానం. ఎన్నో సార్లు శ్రీధర్ రెడ్డి స్వయంగా నేను చనిపోయేంత వరకు జగన్ తోనే ఉంటాను అని చెప్పారు. కట్ చేస్తే గత పది రోజుల క్రితం మీడియా సమావేశంలో జగన్ కు నాపైన నమ్మకం లేదు నా ఫోన్ ను ట్యాప్ చేయించాడు అంటూ చెప్పి పార్టీని వీడాడు.

అయితే ఇది నిర్ధారణ కావాలంటే కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నా విషయాలు మాట్లాడాలంటే ఏదైనా సాలిడ్ ప్రూఫ్ ఉంటేనే ఎవ్వరైనా నమ్మగలరా. ఈ విషయం అలా పెడితే... కోటంరెడ్డి టీడీపీలోకి వెళుతానని ఆరోజే చెప్పిన మాట వాస్తవం.. కానీ స్థానిక రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ అధిష్టానం కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకునే ఛాన్స్ లేదు అని... దీనితో కోటంరెడ్డి తెలియని ఒక డైలమాలో పడ్డాడు. రాజకీయంగా ఎదగాలంటే గుర్తింపు ఉన్న ప్రజలలో విశ్వాసం ఉన్న పార్టీలో ఉండాలి. లేదంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినా పెద్దగా వచ్చేది ఏమీ లేదు.

చంద్రబాబుకు సొంత పార్టీ నాయకుల సూచనల మేరకు కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం లేదట. ఇది తెలిసిన చాలా మంది కార్యకర్తలు మరియు కార్పొరేటర్ లు కోటంరెడ్డిని వీడుతున్నట్లు తెలుస్తోంది. మేము జగన్ పార్టీలోనే ఉంటాము అంటూ కార్యకర్తలు మరియు కార్పొరేటర్ లు అంటూ చెబుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లనున్నారు ? టీడీపీ లోకి కుదరదు కాబట్టి.. పొత్తు పార్టీ అయిన జనసేనలోకి కూడా వెళ్లడం కుదరదు. ఏపీలో బీజేపీకి ఇంకా అంతగా పేరు రాలేదు. స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పే వరకు ఒక గాసిప్ లాగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: