పార్టీవర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది.  వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి పోటీచేసే విషయమై మంత్రి జోగిరమేష్-ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ మధ్య గొడవలు అవుతున్న విషయం తెలిసిందే. మంత్రి జోగి ప్రస్తుతం పెడన నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన సొంత నియోజకవర్గం కాబట్టి వచ్చేఎన్నికల్లో మైలవరం నుండే పోటీచేసుందుకు జోగి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ ఉండగా టికెట్ దక్కటం కష్టంకాబట్టి వసంతను గబ్బుపట్టిస్తున్నారు.

ప్రతి విషయంలోను జోగి మైలవరంలో జోక్యం చేసుకుంటు వసంతను బాగా ఇబ్బంది పెడుతున్నారు. దాంతో ఎంఎల్ఏ కూడా మంత్రికి ఎదురుతిరగటంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇద్దరిమధ్య పంచాయితి చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దాంతో జగన్ ప్రత్యేకంగా జోగి, వసంతను పిలిపించుకుని బుధ, గురవారాల్లో మాట్లాడారు. రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ నివేదిక ప్రకారం మంత్రి జోగికి జగన్ బుధవారం ఫుల్లుగా క్లాసుపీకినట్లు సమాచారం.

పెడన ఎంఎల్ఏగా ఉంటూ మైలవరంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని మంత్రికి జగన్ బాగా తలంటిపోశారట. వచ్చేఎన్నికల్లో 175కి 175 సీట్లలో గెలవాలని తాను కష్టపడుతుంటే ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని పార్టీని కంపుచేస్తారా అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పనిచేసుకుంటే అసలు సమస్యలు ఎందుకొస్తాయని మంత్రిని నిలదీశారట.

రాబోయే ఎన్నికల్లో మైలవరం నుండి వసంతే పోటీచేస్తారని కాబట్టి అనవసరంగా సమస్యలు సృష్టించద్దని జోగికి జగన్ గట్టిగా చెప్పారట. ఇలాంటి క్లాసులే జగన్ మరికొందరు నేతల విషయంలో పీకాల్సుంటుంది. సరిగ్గా ఇలాగే కాకపోయినా గురువారం సీఎంతో భేటీ తర్వాత వసంత మీడియాతో ఇదే  చెప్పారు.  వచ్చేఎన్నికల్లో తానే పోటీచేయబోతున్నట్లు జగన్ తనకు హామీ ఇచ్చినట్లు వసంత స్పష్టంచేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టమని జగన్ తనను ఆదేశించినట్లు వసంత చెప్పారు. సో, తాజా పరిణామాలతో మైలవరం పంచాయితి పరిష్కారమైందనే అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: