ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మంగళవారం నాడు 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇంకా అలాగే ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పొరుగు దేశం అయిన పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి.అలాగే మన ఉత్తర భారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపలు వచ్చాయి. ఆఫ్ఘన్ ఇంకా పాక్ దేశాలలో భూకంపం వల్ల మొత్తం 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో అయితే ఏకంగా 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ దేశంలో స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో మొత్తం 9 మంది, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.ఇక ఫైజాబాద్ కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమి నుంచి మొత్తం 188 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది.


ఈ భూకంపం తర్వాత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులను కోరినట్లు పాక్ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ తెలిపారు. ఆఫ్ఘన్ దేశంలో అన్ని ఆరోగ్య కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.ఇంకా అలాగే ఈ భూకంపం వల్ల మన ఉత్తర భారతదేశంలో  కూడా పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అనేవి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు జమ్మూకశ్మీర్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఇంకా అలాగే రాజస్థాన్‌లలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఈ భూ ప్రకంపలను వచ్చాయి, మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నానంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా తన స్పందన పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: