కస్టడీలో ఎవరు ఎవరిని విచారించారు ? అన్న అనుమానం పెరిగిపోతోంది. అవినీతి కేసులో విచారించేందుకు కోర్టు అనుమతితో సీఐడీ చంద్రబాబునాయుడును కస్టడీలోకి తీసుకున్నది. రెండురోజుల విచారణలో సీఐడీ కొత్త విషయాలు ఏమి తెలుసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఏమాత్రం సహకరించలేదని సీఐడీ తన రిపోర్టులో జడ్జికి వివరించింది. అయితే ఎల్లోమీడియా కథనాలు చూస్తే మాత్రం చంద్రబాబే సీఐడీ అధికారులను విచారించినట్లుంది. తాను అవినీతికి పాల్పడినట్లు ఒక్కటంటే ఒక్క ఆరోపణను చూపమని చంద్రబాబు సీఐడీని సవాలు చేశారట.
చూపిన ఆధారాలను చంద్రబాబు కాదంటున్నారు. తాను అవినీతికి పాల్పడితే తన బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే తెలిపోతుంది కదాని చంద్రబాబు సీఐడీని నిలదీశారట. నిజంగానే చంద్రబాబు అంతటి అమయాకుడా అని ఆశ్చర్యమేస్తుంది. అవినీతికి పాల్పడిన డబ్బును బ్యాంకు అకౌంట్లో చంద్రబాబు దాచుకుంటారా ? తనను అరెస్టుచేసి ఆధారాల కోసం ఇపుడు వెతుక్కుంటున్నారా అని సీఐడీని నిలదీశారట. ఆధారాల కోసం సీఐడీ వెదుక్కోవటంలేదు ఉన్న ఆధారాలను చంద్రబాబు ముందుంచి సమాధానాలను చెప్పమంటోంది.

సీఐడీ అడిగిన ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు, మరచిపోయాననే సమాధానాలు మాత్రమే చెప్పాలని చంద్రబాబుకు లాయర్లు గట్టిగా ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారు. కాబట్టి చంద్రబాబును సీఐడీ ఎన్నిరోజులు కస్టడీలో ఉంచుకున్నా ఇంతకుమించి సమాధానాలు రాబట్టే అవకాశాలు లేవు. జడ్జి స్పష్టంగా చెప్పారు చంద్రబాబుపైన థర్డ్ డిగ్రీ ఉపయోగించేందుకు లేదని. కాబట్టి విచారణలో చంద్రబాబును ఎవరు ముట్టుకునే అవకాశంలేదు.

దాన్ని చంద్రబాబు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నట్లున్నారు. అందుకనే సీఐడీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన చంద్రబాబు ఎదురు సీఐడీనే ప్రశ్నలతో ర్యాగింగ్ చేస్తున్నట్లున్నారు. కస్టడీ విచారణలో ఎంతకాలం ఉంచుకున్నా ఉపయోగం ఉండదని తేలిపోయింది. కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్లోనే ఏమన్నా తేలితే తేలాలంతే. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఉన్నతాధికారుల నోట్ ఫైల్స్, జీవో-ఒప్పందంలోని తేడాలు, షెల్ కంపెనీలకు డబ్బుచేరిన విధానం ద్వారా  స్పష్టమైందని సీఐడీ అంటోంది. దీనికి అదనంగా స్కిల్ స్కామ్ లోని కీలక సాక్ష్యులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పర్దాసాని, కిలారు రాజేష్ దేశం విడిచి పారిపోయారు. మరి చంద్రబాబు ర్యాగింగును తప్పించుకుని సీఐడీ నిజాలు ఎలా రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: