సూటిగా, స్పష్టంగా, సుత్తిలేకుండా చెప్పదలచుకున్నది చెప్పేయటమే జగన్మోహన్ రెడ్డిలోని ప్లస్ పాయింట్. ఈ లక్షణం వల్ల డెఫనెట్ గా నష్టాలు కూడా ఉంటాయి. అయితే అవి కొంతవరకే. దీర్ఘకాలంలో ఈ లక్షణమే ప్లస్సుగా మారుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే గడపగడపకు వైసీపీ వర్క్ షాపులో మంత్రులు, ఎంఎల్ఏలతో జగన్ చాలాసేపు భేటీ అయ్యారు. కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో చాలామందికి టికెట్లు దక్కచ్చన్నారు. అలాగే కొందరికి టికెట్లు దక్కకపోవచ్చని కూడా చెప్పారు.





టికెట్లు దక్కినవాళ్ళు, దక్కనివాళ్ళు కూడా తన మనుషులే అని స్పష్టంగా ప్రకటించారు. టికెట్లు దక్కనివాళ్ళకి ఏదో రూపంలో న్యాయంచేస్తానని హామీఇచ్చారు. నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా 175కి 175 సీట్లలో విజయంసాధించటంపైనే అందరు ఆలోచించాలన్నారు. జగన్ ఈ మాటలు ఎందుకు అన్నారంటే రాబోయే టికెట్లు ఎవరికి రావటంలేదన్న విషయం ఎవరికి వాళ్ళకే తెలుసట. అందుకనే టికెట్లు దక్కనివాళ్ళు బాధపడాల్సిన అవసరంలేదని మరో రూపంలో సర్దుబాటు చేస్తానని హామీఇచ్చింది.





ఇదే చంద్రబాబునాయుడు విషయం చూస్తే చాలామందికి టికెట్ల విషయంలో స్పష్టంగా హామీ ఇవ్వరు. ఇదే సమయంలో టికెట్ కోసం వచ్చిన ప్రతినేతకు జాగ్రత్తగా పనిచేసుకోండి టికెట్ విషయం తనకు వదిలిపెట్టేయండని అంటారు. పనిలోపనిగా టికెట్ మీకే అని అర్ధం వచ్చేట్లుగా సదరు నేతలతో మాట్లాడుతారు. దాంతో చంద్రబాబును కలిసిన ప్రతినెతా టికెట్ తమకే అనే భ్రమల్లో ఉంటారు. తీరా టికెట్ ఇచ్చేటప్పడు సీన్ మొత్తం మారిపోతుంది.





జగన్-చంద్రబాబు మధ్య తేడా ఇక్కడే కనబడుతోంది. చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేయటం జగన్ లక్షణమైతే చివరివరకు నేతలను కన్ఫ్యూజన్లో ఉంచటం చంద్రబాబుకు అలవాటు. ఈమధ్యనే జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో రెబల్ ఎంఎల్ఏల విషయంలో జగన్ కాస్త డ్రామా ప్లేచేసుంటే మొత్తం ఏడు సీట్లూ వైసీపీనే గెలుచుకునేది. అయితే ముక్కుకి సూటిగా చెప్పదలచుకున్నది చెప్పటంతో క్రాస్ ఓటింగ్ వల్ల  ఒక సీటులో ఓడిపోయింది. సీటును ఓడిపోవటానికైనా సిద్ధపడ్డారే కానీ డ్రామా ప్లేచేయటానికి ఇష్టపడలేదు. ఇదే జగన్లో ప్లస్ పాయింటు.

మరింత సమాచారం తెలుసుకోండి: