గురువు చంద్రబాబునాయుడుకు శిష్యుడు రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో స్పష్టంగా అందరికీ తెలిసిందే. సీఎల్పీ నేతగా, కాబోయే ముఖ్యమంత్రిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రేవంత్ ను ఎంపికచేశారు. కాంగ్రెస్ అగ్రనేతల్లోనే కాకుండా గెలిచిన ఎంఎల్ఏల్లో కూడా అత్యధికులు రేవంత్ నే ముఖ్యమంత్రిగా బలపరిచారు. ఇక క్యాడర్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి నియోజకవర్గంలోను రేవంత్ కు మద్దతుగా క్యాడర్ ర్యాలీలు చేశారు.

ఎన్నికల్లో ప్రచారం చేయటం ద్వారా మెజారిటి జనాల ఆమోదంతోనే పార్టీని గెలిపించుకుని రాజమార్గంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇక రేవంత్ గురువు చంద్రబాబు విషయం  ఇలాంటి  వ్యవహారానికి పూర్తి విరుద్ధం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి రెండు పదవులనూ లాగేసుకున్నారు. ఎన్టీయార్ ను పదవుల్లో నుండి దింపేసేక్రమంలో మెజారిటి మీడియాలో ఒక్క ముక్క కూడా వ్యతిరేకంగా వార్తలు రాకుండా మ్యానేజ్ చేసుకున్నారు.

అందుకనే చంద్రబాబును  ప్రజాబలం ఉన్న నేతగా ఎవరూ అంగీకరించరు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, వ్యవస్ధలను మ్యానేజ్ చేయటమే అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించే కారణమిదే. తనలో నాయకత్వ లక్షణాలున్నాయని, ప్రజాబలం ఉన్న నేతని రేవంత్ నిరూపించుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఒక్కసారి కూడా నిరూపించుకోలేదు. రెండుసార్లు టీడీపీ ఎలాంటి పొత్తులు లేకుండా పోటీచేస్తే  రెండుసార్లూ ఓడిపోయింది. పొత్తులు లేకుండా సొంతంగా పార్టీని చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి తీసుకురాలేదు.

అభిప్రాయ సేకరణలో కూడా 64 మంది ఎంఎల్ఏల్లో  47 మంది రేవంత్ కే మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన భట్టి విక్రమార్కకు ముగ్గురు ఎంఎల్ఏలు మాత్రమే మద్దతిచ్చారు. పొంగులేటి శ్రీనివాసులరెడ్డికి ఐదుగురు ఎంఎల్ఏలు మద్దతు పలికారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముగ్గురు ఎంఎల్ఏలు మద్దతు పలికారు. జనాల్లో, పార్టీ నేతల్లో, మెజారిటి ఎంఎల్ఏల మద్దతు ఉంది కాబట్టే అధిష్టానం కూడా సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ కే మద్దతు పలికింది. ఇక్కడే రేవంత్-చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: