ఆ రెండు దేశాల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే. ఉమ్మడి శత్రువు కూడా ఒక్కటే. ఏం చేసినా సరే భారత్ ను నిలువరించాలి. అంతర్జాతీయంగా భారత్ కు వస్తున్న పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్ఠలను దిగజార్చాలి. అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న భారత్ ను మళ్లించడమే టార్గెట్ గా పనిచేస్తున్నాయి. అవే చైనా, పాకిస్థాన్ దేశాలు. దేశం ఎంతో వేడుకగా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించుకుంది. యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు బాల రాముడిని దర్శనం కోసం ఎదురు చూశారు. కానీ ఈ సమయంలో మన పొరుగు దేశాలైన చైనా, పాక్ లు మనల్ని దెబ్బకొట్టాలని చూశాయి. కానీ భారత్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. చైనా కుయుక్తులకు చెక్ పెట్టింది. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మన సైబర్ సెక్యూరిటీ సంస్థ 1244 ఐపీ అడ్రస్ లను బ్లాక్ చేశారు.


ఈ వార్త ఆ రెండు రోజులు సంచలనంగా మారింది. అయితే సైబర్ ముప్పును ముందే పసిగట్టిన మన సైబర్ సెక్యూరిటీ సంస్థ వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి తిప్పికొట్టడంలో సఫలీకృతం అయ్యారు. జనవరి 22న అయోధ్య ఆలయ  ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సమయంలో మనమంతా భక్తితో పరవశించి పోతుంటే.. మన దేశంలోని ముఖ్యమైన వెబ్ సైట్లపై దాడి చేసేందుకు పాక్, చైనాకు సంబంధించిన హ్యాకర్లు ప్రయత్నించారు.


ఈ హ్యాకర్లు రామ మందిర్, ప్రసార భారతి తో పాటు ఇతర వైబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు యత్నించారు. ఇందులో దాదాపు 140 వెబ్ సైట్లు ఆ రోజు రామ మందిర ప్రసారాన్ని ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్న ప్రసార భారతిని హ్యాక్ చేయబోయారు. ఇందులో చైనావే 999 ఉండగా.. మిగతా 245 పాకిస్థాన్ కి సంబంధించిన హ్యాకర్లు.  జీ-20 సదస్సుల సమావేశాల్లోను ఇలానే చేయబోయారు.  మనం సంతోషంగా ఉత్సాహం. సదస్సులు నిర్వహించుకుంటుంటే వాటిని ఆపేందుకు యత్నించి.. భారత్ పై ఎంత ద్వేషంతో ఉన్నాయో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: