అధికారం లో ఉన్న జగన్ పార్టీని గద్దె దించడమే లక్ష్యం గా ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం గా కొనసాగుతున్న టిడిపి ముందుకు సాగుతుంది. ఇందుకోసం మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కూడా టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే మొదటి నుంచి జనసేన తో పొత్తు ఉందనే ఉంది. ఇక కొత్తగా బీజేపీతో కూడా పొత్తుకుదుర్చుకున్నారు ఆయన. ఈ క్రమంలోనే ఇక అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో కూడా సర్దుబాట్లు చేసుకున్నారు అని చెప్పాలి.



 ఇలా పొత్తు కారణం గా పూర్తి స్థాయిలో అన్ని స్థానాలలో అటు టిడిపి పోటీ చేయలేక పోతుంది. ఈ క్రమం లోనే కొంత మంది ఆశావాహులకు చివరికి టికెట్ దక్కుతుంది అనుకుంటే నిరాశ ఎదురవుతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయం లో కొంత మంది టికెట్ దక్కకపోవడం తో.. పార్టీని వదిలేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంతో గత కొన్ని రోజుల నుంచి టిడిపి పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్న విషయం తెలిసిందే. ఏకంగా మూడు దశాబ్దాల నుంచి పార్టీలో ఉంటున్న సీనియర్ నేతలు సైతం ఇక ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో తిరుగుబావుట ఎగరేస్తున్నారు.


 అయితే కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నవారు.. సాధారణంగా వేరే పార్టీలోకి వెళ్తారు. కానీ కొంత మంది నేతలు మాత్రం  టిడిపి పార్టీ అంటే ఇష్టం ఉన్న టికెట్ ఇవ్వని పార్టీలో ఉండలేక.. ఇంకో పార్టీలోకి వెళ్లలేక ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించాడు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సైతం అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సైతం చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా రెబల్ ఎమ్మెల్యేగా బలిలోకి దిగే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap