తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సత్యదేవ్ ఒకరు. ఈయన ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించి సినిమాలో హీరో అవకాశాలను దక్కించుకున్నాడు. హీరోగా నటిస్తున్న సమయం లోనే ఈయన చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ లో విలన్ పాత్రలో కూడా నటించాడు. 

ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి తో పోటీ పడి నటించి సత్య దేవ్ కూడా ప్రేక్షకులకు నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సత్య దేవ్ "కృష్ణమ్మ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణం గానే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను కూడా బాగానే నిర్వహిస్తూ వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ ని మే 3 వ తేదీన విడుదల చేయడం లేదు.

తాజాగా కొత్త విడుదల తేదీని ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా ... మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు అలాగే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మూవీ ని రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం విడుదలకి రాబోతుంది. మరి ఈ మూవీ తో సత్యదేవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: