ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచి ఈ వార్ తారా స్థాయికి చేరింది. ప్రతి వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ అందేది. కానీ ఈ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతోనే అసలు సమస్య మొదలైంది. ఇలా జరగడానికి టీడీపీ అధినేత చంద్రబాబే ప్రధాన కారణం అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.


అయితే వీరిపై ఎల్లో మీడియా ఆది నుంచి తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. వీరిని వైసీపీ కార్యకర్తలుగా, వైసీపీపై వాలంటీర్ల తిరుగుబాటు.. జగన్ కు అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లు అని రకరకాలుగా కథనాలు వండి వడ్డిచింది. వాళ్లు ఏ చిన్న తప్పు చేసినా మొయిన్ పేజీలో వార్తలు కవర్ చేస్తూ వ్యవస్థను తప్పు పట్టే ప్రయత్నం చేశారు.  ఇంతకీ వాలంటీర్లపై తమ స్టాండ్ ఏమిటో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. కానీ వాలంటీర్ల వల్ల టీడీపీ గ్రాఫ్ దెబ్బతింది అన్నది మాత్రం సుష్పష్టం.


దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు. తాము అధికారంలోకి వస్తే జీతం పదివేలు చేస్తామని.. వీరిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు వీరు నెలకి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తానని చెప్పారు. కానీ ఇవి ఎలా సాధ్యం అనే విషయాలు మాత్రం చెప్పలేదు. మొత్తానికి వాలంటీర్ ఎపిసోడ్ లో ప్రజలను కన్విన్స్ చేయడం మానేసి వీళ్లను విలన్లుగా చిత్రీకరించారు.

ఒకవైపు వాలంటీర్లకు అనుకూలంగా చంద్రబాబు హామీలు ఇస్తుంటే మరోవైపు టీడీపీ నాయకులు వారిపై కేసులు పెడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా  కొండకరకం గ్రామానికి చెందిన మహిళా వాలంటీర్ సోషల్ మీడియా ద్వారా పింఛన్లను ఆపేయించింది టీడీపీ యేనని దుష్ప్రచారం చేస్తుందని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఒకవేళ రాజీనామా చేయకుండా ఈ తరహా పోస్టులు పెడితే ఆమె చేసింది తప్పే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: