ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా ఎన్నికల వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని రోజులు జరగబోతున్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. అయితే ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి తమ ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు అందరు కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు.


 ఇలా అంతట ఎన్నికల హడావిడి నెలకొన్న సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం మోడీ ముత్యాల నాయుడు కు మాత్రం ఎవరికి రాని కష్టం వచ్చింది. ఆయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బిజెపి నేత సీఎం రమేష్ పై పోటీ చేస్తున్నారు. ఇక ఆయన నియోజకవర్గం మాడుగుల సీటును కుమార్తెకు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇక ముత్యాల నాయుడు కుమారుడు తండ్రితో విభేదించాడు.  ఇప్పుడు తండ్రిని ఓడించేందుకు ప్రచారం చేస్తున్నాడు. మాడుగుల సీటు ఇప్పించుకున్న కుమార్తె రెండో భార్య సంతానం కావడం.. ఇక ఇప్పుడు సీటు కోసం ఆశించి బంగపడిన కుమారుడు మొదటి భార్య సంతానం కావడం గమనార్హం.


 సొంత కొడుకుకి న్యాయం చేయలేక పోయిన తన తండ్రి.. ఇక ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏం న్యాయం చేయగలడు అంటూ తన తండ్రి పైన వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. మొదటి భార్య కుమారుడు రవికుమార్ ఒకసారి ఓటర్లు ఆలోచించి.. ఇక తన తండ్రికి ఓటు వేయాలి సూచిస్తున్నాడు. తొమ్మిదేళ్లపాటు వైసీపీలో జగన్ వెంట తిరిగినా.. ఏనాడు ముత్యాల నాయుడు కుమారుడిని అని చెప్పుకోలేదు. కానీ ఐదేళ్ల నుంచి నన్ను రాజకీయంగా ఎదగకుండా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో మాడుగుల నుంచి తన సొంత సోదరిని ఓడించేందుకు ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు రవికుమార్. గతంలో కూడా పలుమార్లు ఇలా చేశారు. ఇలా రెండో భార్య కుమార్తె, మొదటి భార్యకు కొడుకు ఒకే చోటు నుంచి బరిలోకి దిగడంతో ఎవరికి రాని కష్టం అటు ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కి వచ్చింది. ఇక ఇక్కడ టిడిపి నుంచి బండారు సత్యనారాయణమూర్తి పోటీలో ఉన్నారు. అయితే అనురాధ, రవికుమార్ ల మధ్య పోటీ వైసీపీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఎటు చూసుకున్న ఇది ఫ్యాన్ పార్టీకే తలనొప్పి తెచ్చిపెట్టే అంశం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: