జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కు వీర అభిమానిగా చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా జబర్దస్త్ లో ఉండేటువంటి కమెడియన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ కు వీర అభిమానులే. అలా కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో షకలక శంకర్ కూడా ఒకరు. గతంలో కమెడియన్ గా ఉన్న ఎన్నో చిత్రాలలో హీరోగా కూడా నటించి ఫెయిల్యూర్ గా మిగిలారు.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో షకలక శంకర్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.


జబర్దస్త్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగానే ఎన్నో స్కిట్లు  చేశారు షకలక శంకర్. పవన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కెరియర్ లో విజయాల కంటే అపజయాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ రంగంలో కూడా పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ గానే వచ్చారని తెలిపారు.. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఓడిన గెలిచిన పెద్దగా తేడా ఉండదని తెలిపారు. పిఠాపురంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే గెలవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారని తెలియజేశారు.. ఎన్నో ఫ్లాపుల తర్వాత గబ్బర్ సింగ్ సినిమా వచ్చి తన కెరీర్ని నిలబెట్టింది అదేవిధంగా పొలిటికల్ గా కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారని తెలిపారు.


ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన ఘనత చిరంజీవిదే అంటూ తెలియజేశారు షకలక శంకర్. ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్ వల్లే తాను ఇప్పటికీ యాక్టర్ గా కొనసాగుతున్నానని తెలియజేశారు షకలక శంకర్. అలాగే జబర్దస్త్ షో కి తనంతటతానే గుడ్ బై చెప్పి వచ్చేసానని కూడా తెలియజేశారు. చివరిగా పిఠాపురంలో కచ్చితంగా పవన్ కు అనుకూల ఫలితాలు దక్కాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. పిఠాపురంలో వంగా గీత పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఉందనే మాట వాస్తవమే.. మరి పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: