పార్లమెంటు ఎన్నికలు అయిపోవడానికి వచ్చాయి. కేంద్రంలో ఈసారి ఎవరు గెలుస్తారని ఆసక్తికరంగా మారింది. అలాగే ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏమి ఆశిస్తున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి జగన్, చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటారు అని అడిగితే ఆన్సర్ చాలా సింపుల్. చంద్రబాబు ఏమనుకుంటారంటే ఎన్‌డీఏ కూటమికి 265 రేంజ్‌లో పార్లమెంటు సీట్లు మాత్రమే గెలుచుకోవాలని కోరుకుంటారు, అలాగే తమకు 15 పార్లమెంటు స్థానాలు రావాలని ఆకాంక్షిస్తారు. ఎందుకు? అలా అయితేనే మోదీ (బీజేపీ)కి చంద్రబాబు సీట్లు అవసరం అవుతాయి. మోదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సీట్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. చంద్రబాబు సీట్లు వెనక్కి లాగేసుకుంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ కుప్పకూలిపోతుంది.

ఈ కారణం చేత మోదీ చంద్రబాబుని అంటిపెట్టుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి జగన్ జైల్లో పెట్టించమని ఆయన అడగొచ్చు. మోదీకి అలా చేయడం తప్ప మరో ఒక మార్గం ఉండకపోవచ్చు. రాష్ట్రం కోసం అభివృద్ధి పనులు చేయమని చంద్రబాబు అడగవచ్చు. నిధులు వాళ్ళని డిమాండ్ చేయవచ్చు. ఏపీ సీఎం జగన్ ను మళ్లీ పాలిటిక్స్ లోకి రాకుండా అణగదొక్కవచ్చు.

 జగన్ కూడా సేమ్ ఇలాగే మోదీ తనపై ఆధారపడాలని కోరుకోవచ్చు తనకు 20 ఎంపీ సీట్లు దాకా రావాలని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తమ సీట్లు అడుక్కోవాలని కోరుకుంటారు. ఇలా జరిగితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి తరిమికొట్టాలని ఎలాంటి కలెక్షన్ లేకుండా చేయాలని జగన్ డిమాండ్ చేయవచ్చు. ఏపీలో చంద్రబాబు అండ్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లేకుండా బీజేపీ మాత్రమే ఆ స్థానంలో ఉండాలని అడగవచ్చు. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై జగన్ ఉక్కు పాదం మోపవచ్చు. ఓవరాల్ గా జగన్ చంద్రబాబు ఇద్దరూ కూడా మోదీ గెలవాలని కోరుకుంటారు. అలాగే ఆయన తమపై ఆధారపడాలని ఆకాంక్షిస్తారు. మరి ఎవరి కోరికలు నెరవేరుతాయో చూడాలి. జూన్ 4వ తేదీన ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap