ఏపీలో ఎన్నికల ముగిశాయి. ఇక అందరి దృష్టి  ఎన్నికల రిజల్ట్ పైనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏపీలో ఎవరు గెలుస్తారని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు,  25 పార్లమెంటు స్థానాల్లో టిడిపి కూటమి,  వైసిపి హోరహూరిగా ఉన్నారు. ఇందులో ఎవరు గెలుపు తీరాలకు వెళ్తారు? ఎవరు  చాప చుట్టేస్తారు అనేది  చెప్పడం కష్టమే.. కానీ జగన్ మాత్రం తన గెలుపును బాహటంగానే చెబుతున్నారు. తప్పకుండా 151 పైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తానని, 22 పార్లమెంటు స్థానాల్లో  విజయ బాగుటా ఎగరవేస్తానని చెప్పారు. 

మరి ఆయన చెప్పింది నిజమైతే మాత్రం  ఇక టిడిపి పార్టీకి ఏపీలో భవిష్యత్తు తగ్గుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే టిడిపిని  నడిపించే శక్తి చంద్రబాబుకు లేకుండా అయిపోయింది.  ఎన్నికల్లోనే చావో రేవో తేల్చుకోవాలని బరిలో ఉండి భారీగా కొట్లాడారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇక టిడిపి పడవను నడిపే  వ్యక్తి లేకపోవచ్చు. చంద్రబాబుకు ఏజ్ మీద పడింది. పార్టీని లీడ్ చేసే అంత శక్తి ఆయనకు లేకుండా పోతుంది. ఇక లోకేష్ కు అంత స్టామీనా లేదనే అపోహ టీడీపీ నాయకుల్లోనే  ఉంది. అలాంటప్పుడు టిడిపిని నడిపించే నాయకుడు మాత్రం దరిదాపుల్లో కనిపించడం లేదు.

 ఇదే తరుణంలో ఆనాడు ఎన్టీఆర్ చంద్రబాబును ఏ విధంగా వెంటేసుకొని తిరిగారో,  ఈనాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంటేసుకుని తిరుగుతున్నారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అయినా సరే లేదంటే ఆ తర్వాత ఎలక్షన్స్ వరకైనా సరే  పవన్ కళ్యాణ్ కీలక లీడర్ గా మారే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ టిడిపి గెలిస్తే ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చి  అక్కడే ఆపేస్తారు. ఒకవేళ టిడిపి ఓడిపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ వరకు  పవన్ కళ్యాణ్ అద్భుతమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: