వింత సమస్యలతో సతమతమవుతోంది చైనా. దశాబ్దాల క్రితం జనాభా కంట్రోల్ కోసం వేసిన ఓ 'వన్ చైల్డ్ పాలసీ' పాచిక ఇప్పుడు పెను విపత్తుగా మారింది. ఆ చట్టాన్ని ఉక్కు పిడికిలితో అమలు చేయడంతో పుట్టబోయే బిడ్డ లింగంపైనే ప్రభావం పడింది. కొడుకులే ముఖ్యం అనుకొని, ఆడపిల్లంటే గర్భంలోనే చిదిమేయడం, లేదా నిర్లక్ష్యం చేయడం పెరిగిపోయింది.

దీని ఫలితం ఏమిటంటే, జనరేషన్ గడిచేసరికి ఆడపిల్లల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. వెయ్యి మంది మగవారికి కనీసం ఏడొందల మంది ఆడవారు కూడా దొరకని పరిస్థితి. దాంతో ఆడపిల్లలకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతోంది. పెళ్లిళ్ల బేరసారాలు మొదలయ్యాయి. అమ్మాయి కావాలంటే, అబ్బాయి అత్తింటికే వెళ్లాలి. అత్తమామలను పోషించాలి. సంపాదంతా అటుకే వెళ్లాలి, ఇలాంటి వింత కండిషన్లు ఉన్నాయి.

ఈ క్రమంలోనే విడాకులు అనేవి కొందరికి 'బంపర్ ఆఫర్'గా మారిపోయాయి. పెళ్లి చేసుకోవడం, ఏదో ఒక గొడవతో త్వరగా విడాకులు తీసుకోవడం, భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిలో సగం వాటా లాక్కోవడం, మళ్లీ ఇంకొకరిని వెతుక్కోవడం... ఇదొక 'డైవర్స్ ఇండస్ట్రీ' లాగా మారిపోయింది చైనాలో.

దీంతో కంగుతిన్న యువకులు... మన ఆస్తి పోతుంది, అని భయపడిపోయి, పెళ్లికి దూరంగా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

ఈ పరిణామాలు చూసి చైనా ప్రభుత్వం బిత్తరపోయింది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి, అత్యవసరంగా డైవర్స్ చట్టాల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై విడాకులు తీసుకుంటే భార్యకు భర్త ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి కష్టార్జితం వారికే అని చట్టంలో మార్పులు తెచ్చింది. పిల్లల సంగతికొస్తే, ఎంతమంది ఉంటే, వారి పోషణ బాధ్యత ఇద్దరిపైనా సమానంగా ఉంటుంది. ఒకరే ఉంటే, ఇద్దరూ కలిసి ఖర్చు పెట్టాలి. ఇద్దరుంటే, చెరొకరిని చూసుకోవాలి.

దీంతో 'డైవర్స్ ద్వారా డబ్బు సంపాదించాలనే' ఆశలపై చైనా ప్రభుత్వం నీళ్లు చల్లింది. కోట్లు కొల్లగొట్టే 'డైవర్స్ బిజినెస్'కు దాదాపు తెరపడినట్లే. దశాబ్దాల క్రితం నాటి జనాభా నియంత్రణ ప్రయోగం... ఇలా పెళ్లిళ్లు, విడాకుల దాకా పాకి, చివరికి చట్టాలనే మార్పించేసిందన్నమాట. చైనాలో నిజంగా ఇది షాకింగ్ ట్విస్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: