
తెలంగాణ దిశను మార్చిన పథకాలు:
తెలంగాణ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావాలంటే కరెంటు ఉండదనే సాకు చెప్పి తప్పించుకునేవారు. అలాంటి రాష్ట్రానికి 24 గంటల కరెంటు తీసుకువచ్చి, ఐటీ కంపెనీలు వచ్చేలా చేశారు కేసీఆర్. పేదింటి ఆడబిడ్డ పెళ్లి తర్వాత ఇబ్బందులు పడకూడదని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో ప్రతి పేద ఇంటికి పెద్దన్నలా మారారు. కాలేశ్వరం కట్టించి తెలంగాణలో నెర్రలు వారిన నేలను తడిపాడు. రైతుబంధుతో కర్షకుల వెన్ను తట్టాడు. రైతు బీమాతో పేద అన్నదాతకు ధీమా అందించాడు. మిషన్ భగీరథతో పేదల దాహాన్ని తీర్చి, మిషన్ కాకతీయతో చెరువులన్నీ నింపాడు. ముసలి తల్లులకు, వితంతు, వికలాంగులకు, ఆసరా పింఛన్లతో ఆప్తుడయ్యాడు.. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి దేశంలో కనివిని ఎరుగని పథకాలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పవచ్చు.
సెంటిమెంటల్ గా హుస్నాబాద్ ఎల్కతుర్తి:
కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు ముందు తప్పనిసరిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో సభ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ సభ పెడితే ఆయన అనుకున్న ఏ పనైనా తప్పనిసరిగా నెరవేరుతుందని సెంటిమెంట్. ఆ విధంగానే గత పది సంవత్సరాల పాలనలో ఏ పథకాన్ని ప్రారంభించిన హుస్నాబాద్ నుంచే మొదట సభ పెట్టేవారు. ఆ విధంగానే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రజల్లో ఊతం పుట్టించేందుకు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలుకతుర్తిలో పార్టీ స్థాపించి 24 ఏళ్లు పూర్తిచేసుకుని 25 ఏళ్లలో అడుగుపెడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రమంతా పెక్కటిల్లేలా, రజతోత్సవం పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నుంచే రాబోవు రోజుల్లో చేయాల్సిన పనులు, కాంగ్రెస్ చేస్తున్న తప్పులను వివరించబోతున్నారు. ఈ సభలో కేసీఆర్ ను కల్లారా చూడాలని ఏం మాట్లాడబోతున్నారని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ నాయకులకు కూడా కేసీఆర్ నోట్లో నుంచి ఏం వస్తుందా అని ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.