ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సూటిగా చెప్పాలంటే ఫైబర్ నెట్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది. ఫైబర్ నెట్ సబ్ స్కైబర్ల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగేలా ఏపీ సర్కార్ ముందడుగులు వేయాల్సి ఉంది.
 
చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ విషయంలో సేవలు మరింత మెరుగయ్యే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఫైబర్ నెట్ వ్యవస్థను బాగుపరిచి ఈ సమస్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వాళ్లను పక్కన పెడితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ నెట్ విషయంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
 
కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు ఇబ్బందులు పడకుండా విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఏపీ ఫైబర్ నెట్ విష్యంలో రాబోయే రోజుల్లో అయినా ఈ మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ విధంగా జరగని పక్షంలో ఈ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ప్రైవేట్ సంస్థలకు ధీటుగా సేవలను అందించే విషయంలో ఏపీ ఫైబర్ నెట్ వెనుకబడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఫైబర్ నెట్ ద్వారా ఎక్కువ సంఖ్యలో సేవలు అందిస్తున్నా మెరుగైన సేవలు మాత్రం అందడం లేదు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 


మరింత సమాచారం తెలుసుకోండి: