భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది.. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మొదలుపెట్టిన దాడి సక్సెస్ గా కొనసాగింది. ఉగ్రవాద స్థావరాలను కళ్ళముందే కూల్చేయడంతో పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఉగ్రవాదులకు బడా డాన్ గా పేరు పొందిన ఉగ్రవాది మసూద్ ఆజార్ కు భయాన్ని కూడా చూపించారు భారత్. అయితే ఇలాంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు భారీ నజరానాను ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అలాగే ఆపరేషన్ సిందూర్  ఘటనలో మరణించిన ఉగ్రవాద కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మసూద్ ఆజార్ ఇంటి పైన  భారత్ సైన్యం దాడి చేయడంతో బహవల్పూర్ లో ఉన్న  మహమ్మద్ ఇల్లు కూడా పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. ఈ ఘటనలో మసూద్ కుటుంబ సభ్యులు ఏకంగా 14 మంది అక్కడికక్కడే మరణించారు. దీనివల్ల పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మసూద్ కు 14 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నదట.

దాడి అనంతరం మసూద్ స్వయంగా ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ వల్ల.. తన అక్క బావమరిది తో పాటు పిల్లలు మరణించారని తెలిపారు. అలాగే తన సోదరుడు మరణించారని ఇలా తన కుటుంబ సభ్యులు 14 మంది మరణించారని మసూద్ ఒక లేఖ ద్వారా తెలిపారు. దీంతో తాను ఇప్పుడు జీవించాలనుకోవడం లేదని తాను కూడా మరణించాలనుకుంటున్నానంటూ భావోద్వేగంతో రాసినట్లుగా  ఇక లేఖ వైరల్ గా మారింది. బహావల్పూర్  దాడిలో మరణించిన వ్యక్తులకు సంబంధించి డబ్బు ఎవరికి ఇస్తారనే విషయం పైన ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదట. మసూద్ ఉగ్రవాద శిక్షణ కేంద్రం కూడా పూర్తిగా నేలమట్టం అయ్యింది. సుమారుగా ఇది 18 ఎకరాల పాటు ఉన్నదట. ఇక్కడే మసూద్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవారట.ఇప్పుడు మసూద్ ఎక్కడ ఉన్నాడని విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. పాకిస్తాన్ హై సెక్యూరిటీ కల్పించి ఎక్కడో దాచారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: