
ఇషాక్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరపడం వల్ల మే 12 నుంచి మే 14 చివరికి మే 18 వరకు మాత్రమే కాల్పుల విరమణ ఒప్పందం కుదురుచ్చారని రాజకీయ స్థాయిలో చర్చలు జరిగితేనే ఏదైనా సైనికు ఒప్పందం జరిగితే పూర్తిగా అమలవుతుందని తెలిపారు. ఫహల్గం ఉగ్రదాడి తర్వాత మూడు వారాలలో భారత్ తీసుకున్న కొన్ని కఠినమైన చర్యల పట్ల పాకిస్తాన్ కూడా ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాలను సైతం ఆపివేయడంతో పాకిస్తాన్ ప్రజలను తీవ్ర కలవరపాడుకు గురిచేస్తోంది.
కాల్పుల విరమణ ప్రకటించిన కూడా సింధు ఒప్పందం పైన ఎలాంటి చర్చలు జరిపేది లేదంటు భారత్ తెలియజేసింది. ఉగ్రవాద ఆక్రమిత కాశ్మీర్పైన చర్యలు కచ్చితంగా ఉంటాయనే విధంగా భారత్ కూడా హెచ్చరించింది. పాకిస్తాన్, సింధు జలాల ఒప్పందం పైన చర్చించేందుకే ఇండియాను రాజకీయ చర్చలలోకి లాగేలా ప్రయత్నాలు చేస్తోందనే విధంగా వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. మరి మే 18న పరిస్థితి ఎలా ఉంటుంది? రెండు దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయో అన్న విషయం చూడాలి మరి. మొత్తానికి మే 18 డెడ్లైన్ గా పెట్టుకోండి పాకిస్తాన్.