
ఆ సమయంలోనే కొండా సురేఖ మాట్లాడుతూ తన దగ్గరికి కొన్ని ఫైల్స్ వస్తుంటాయని మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని మరి ఫైల్స్ ని క్లియర్ చేస్తూ ఉంటారని కానీ తాను అలా చేయనని సమాజ సేవ చేయడం కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని తనకు ఎవరూ కూడా నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదని స్కూల్ డెవలప్మెంట్లు చేయమని మాత్రమే కోరాను అంటూ తెలియజేసింది మంత్రి కొండా సురేఖ. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ..తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తాను వరంగల్ లో చేసిన ఈ వ్యాఖ్యలు కూడా నిజం.. ప్రతి ఫైలుకు కూడా డబ్బులు తీసుకుంటున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు బాగా తెలుసు.. అందుకే నా వాక్యాలను కొంతమంది వక్రీకరిస్తున్నారంటూ వెల్లడించింది. అయితే కేవలం కొంతమంది తాను మాట్లాడిన వ్యాఖ్యలలో వెనుక ముందు కట్ చేసి చిన్న క్లిప్పులుగా చేసుకొని మరి ట్రోల్స్ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటివన్నీ కూడా క్యాబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కుట్రతోనే చేస్తున్నారని తెలిపింది. పనిచేస్తున్న మంత్రులపైన ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదంటూ తెలిపింది. తాను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతూ ఒకో మెట్టు ఎక్కి మరి ఈ స్థాయికి వచ్చానని తన పైన ఎవరు తప్పుడు ప్రచారాలు చేసిన ఎవరిని వదిలిపెట్టను అంటూ హెచ్చరించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ కూడా విసిరింది.