
దీంతో బిజెపి పార్టీ చేయాలనుకున్న పనులకు మిత్రపక్షంలో కొంతమంది నేతలు అడ్డుపడుతూ ఉండడంతో ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ పేరిట చేసిన పనికి మోడీ పేరు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి దేశమంతా తిరిగి ర్యాలీలు చేయడానికి వీటితోపాటు రాష్ట్రస్థాయిలో కూడా బిజెపి ముఖ్యమంత్రుల నుంచి జిల్లా స్థాయిలో నాయకుల వరకు ఈనెల 13 నుంచి మొదలైన ర్యాలీలు ఈనెల 23 వరకు చేయబోతున్నారు. అలా సుమారుగా 11 రోజులపాటు దేశవ్యాప్తంగా బిజెపి ర్యాలీలను నిర్వహించింది.
అయితే ఇదంతా ఆపరేషన్ సిందూర్ ద్వారా వచ్చిన ఇమేజ్ ని పూర్తిగా రాజకీయంగా మళ్ళించుకోవడానికి అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నడు లేని విధంగా దేశంలో బిజెపి కి ప్రజలు చాలా అనుకూలిస్తున్నారు. అలాగే కుల గణనకు కూడా బిజెపి చేపట్టి ఈసారి ఎన్నికలలో బీసీలకు, ఓబీసీలకు పెద్దపీట వేసే విధంగా ప్లాన్ చేస్తాందట. ఇక కులగనన 2026 లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే 2027 లోనే జమిలి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలు బిజెపి చూస్తున్నట్లు సమాచారం. ఇలా అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలకు వెళితే 400 శీతల లక్ష్యాన్ని చేరుకుంటామని బిజెపి భావిస్తోందట.
ఇక కూటమిలో భాగంగా ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బిజెపి చంద్రబాబుకు హింట్ ఇచ్చిందేమో అందుకే సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని టార్గెట్ 2027 గా గురిపెట్టినట్టుగా కనిపిస్తోంది. అలాగే మహిళల కోసం మరిన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టబోతున్నారట. ఇక సింగల్ గా పోటీ చేయాలనే ఆలోచన విరమించుకొని కూటమి గానే మళ్లీ పోటీ చేయాలని చూస్తోంది టిడిపి.