పాకిస్థాన్ గూఢచారి గా ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు అయిన ప్రముఖ యూట్యూబ్ గా జ్యోతి మల్హోత్రా కేసులో అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకోవాలని తన చాటింగ్లో బయటపడినట్లుగా అధికారులు బయటపెట్టారు. పాకిస్తాన్ని పొగుడుతూ ఉన్నట్టుగా తన డైరీలోని చాలా విషయాలు బయటపడ్డాయి..అంతేకాకుండా భారతదేశానికి సంబంధించి రక్షణ దళాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ను కూడా అక్కడ అధికారులతో పంచుకున్నట్లు తెలియజేసింది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ప్రముఖ యూట్యూబ్ ప్రియాంక సేనపతితో కలిసి ఉన్న ఒక వీడియో కూడా బయటకు రావడంతో ఈమె పైన కూడా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.


అలా జ్యోతితో చాలా చనువుగా ఉన్న వారిలో ప్రియాంక కూడా ఒకరు. వీరిద్దరూ పాకిస్తాన్ వాళ్లతో సంభాషణ  చేసేవారని సమాచారం. వీరిద్దరూ కలిసి జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయి..అయితే నాలుగు నెలల క్రితం ప్రియాంకతో కలిసి జ్యోతి ఫహల్గం వెళ్లినట్లుగా అధికారులు తెలియజేశారు. దీంతో జ్యోతి స్నేహితురాలు అయిన ప్రియాంక సేనాపతిని  ఒడిస్సా ప్రాంతంలో పోలీసులు ప్రత్యేకించి మరి ఆమెను విచారించారట. అయితే వీరిద్దరూ కలిసి పలు ప్రదేశాలకు వెళ్లడంతో పాటు పాకిస్థాన్ కు సందర్శించినట్లు తెలియజేసింది. అలాగే ఒడిస్సా లోని పలు ప్రాంతాలలో పర్యటించారనే విషయాన్ని కూడా సేకరించారట అధికారులు. ముఖ్యంగా ప్రియాంక జ్యోతి ఇద్దరు కలిసి పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ వీడియోలు తీయడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వీడియోను జ్యోతి ISI చేరవేసి ఉంటుందనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.


జ్యోతి మల్హోత్రా కాంటాక్ట్స్  పైన  అధికారులు ప్రత్యేకమైన నిగా ఉంచి పెట్టడంతో ఇంకా ఎవరైనా ఇలాంటి స్పై ఏజెంట్లు ఉన్నారా అనే విషయంపై దర్యాప్తు చేయగా.. ఈ క్రమంలోనే ఒడిస్సా ప్రాంతానికి చెందిన యూట్యూబర్ ప్రియాంకతో జ్యోతి స్నేహం ఉన్నట్లుగా బయటపడిందట.విచారించగా జ్యోతి తనకు యూట్యూబ్ ద్వారా మాత్రమే పరిచయమైందని.. తనకేమీ తెలియదు అంటూ తెలుపుతోంది.అలా పరిచయమైన నాలుగు నెలలకే పాకిస్తాన్లో ఇద్దరు పర్యటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: