రాయలసీమ రాజకీయలలో తాడిపత్రి నియోజకవర్గం నిరంతరం వాడి వేడిగా కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ సీనియర్ నేత అయినా ప్రభాకర్ రెడ్డి ఆయన ప్రతి మాట కూడా ఆవేశంతో మాట్లాడుతున్నప్పటికీ అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది. అందుకే జెసి ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూటమి పార్టీలో అందరిని ఆలోచనలో పడేసేలా చేస్తూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది కాకుండానే తాజాగా జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.



ముఖ్యంగా జెసి ప్రభాకర్ రెడ్డికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటో అర్థం అయ్యాయని అందుకే ఏడాదిలోపే ఆయన ఇలా అన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ఒక సమావేశంలో మాట్లాడితే వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంటుందనీ.. ఆయన ఒక్క తాడిపత్రి నియోజకవర్గం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఏపీ అంతటా కూడా ఉన్న పరిస్థితుల పైన అవగాహన తెలుసుకొనే మాట్లాడారంటూ కొంతమంది నేతలు చెబుతూ ఉన్నారు. ప్రజలలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రస్తుతం సానుకూలత లేదని అర్థం వచ్చేలా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారని చాలామంది టీడీపీ నేతలు తెలుపుతున్నారు.


గత ఎన్నికలలో కూటమిలో 164 సీట్లు గెలుచుకున్నప్పటికీ ఈసారి గట్టి పోటీ ఉంటుందని చెప్పి కూటమిని హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తోందని చాలామంది నేతలు భావిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చలేదు. రాబోయే కొన్ని నెలలలోనే అన్ని హామీలను కూడా నెరవేరుస్తామన్న కూటమి ప్రభుత్వం ఆమె అమలు క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తామంటూ తెలిపారు.. అయితే ఇలాంటి సమయం చేసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ అంతట వైరల్ గా మారుతున్నాయి. కాకుండా వీటికి తోడు కూటమి నేతల మధ్య కూడా విభేదాలు, ఆధిపత్య పోరు వంటివి కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి.ముఖ్యంగా మిని మహానాడులోనే చాలామంది బహిరంగంగానే తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: