ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తర్వాత టిడిపి పార్టీ పగ్గాలు నారా లోకేష్ కి ఇవ్వాలని చాలామంది ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. అయితే కూటమిలో భాగంగా చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నంతవరకు టిడిపి పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అటు కార్యకర్తలు నేతలు కూడా భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? చంద్రబాబు తర్వాత టిడిపి భవిష్యత్తు ఏంటి అని కూడా చాలామంది నేతలు ఆందోళన చెందుతున్న మాట నిజమే అయినప్పటికీ చంద్రబాబు స్థాయిలో నారా లోకేష్ రాజకీయం చేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.


కూటమిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బిజెపి నేతలు సైతం చంద్రబాబు స్థానాన్ని చేరుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జాతీయస్థాయిలో పేరు ఉన్న టిడిపి పార్టీకి లోకేష్ ని గతంలో చాలామంది పప్పు అంటూ విమర్శించేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో లోకేష్ ని పప్పు అనుకోవచ్చా అంటే? అది సరైనది కాదు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అలా లోకేష్ ని తక్కువ అంచనా వేస్తే ప్రత్యర్థులకే నష్టమ అంటూ తెలుపుతున్నారు.


నారా లోకేష్ రాజకీయాలలో వచ్చిన మొదట్లో ప్రసంగాల వల్ల ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా అన్ని అంశాల పైన కూడా అవగాహన పెంచుకొని మరి ముందుకు వెళుతున్నారు నారా లోకేష్. జాతీయ, అంతర్జాతీయ వేదికల పైన కూడా నారా లోకేష్ ఒక నాయకుడిగా నిరూపించుకోవడంలో ప్రస్తుతం సక్సెస్ అయ్యారు. పార్టీ కార్యకర్తలే బలంగా చూసుకొని నారా లోకేష్ పప్పు నుండి నిప్పుగా మారిపోయారు. అంతేకాకుండా ఇటీవలే ఒక టిడిపి కార్యకర్త హత్య చేయడంతో అతని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలనే నిర్ణయం లోకేష్ తీసుకున్నారట.. అయితే ఈ విషయం ప్రత్యర్థుల నుంచి విమర్శలకు దారి తీసిన కానీ తన కోణంలో టిడిపి కార్యకర్తకి భరోసా కల్పించారు.


అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న టీ కొట్టులకు వెళ్లి టీ తాగి మరి అక్కడ వారితో ముచ్చటిస్తున్నారు. మహానాడులో కూడా సీనియర్ నాయకులు ,జూనియర్ నాయకులు అని తేడా లేకుండా అందరితో కలిసిపోయారట. ఏది ఏమైనా గతంలో లోకేష్ కి ప్రస్తుతం ఉన్న లోకేష్ కి చాలా వ్యత్యాసం కనిపిస్తోందనే విధంగా విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: