ప్రతి నెలతో పాటుగా ఈసారి కూడా కొత్త నెల ప్రారంభం నుంచి పలు రకాల అంశాలు మారుతున్నాయి.. గ్యాస్ ధరలు మరొకవైపు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా అన్నిటి పైన కూడా మార్పులు ఉంటున్నాయి.. ఆర్థికంగా సామాన్యుల జోబులపైన ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు కీలకమైన మార్పులు జరగబోతున్నాయట. ఈ నెలలో వాటి గురించి చూద్దాం.


ఈరోజు నుంచి EPFO 3.O కొత్త వర్షన్ ప్రారంభిస్తోంది. గతంలో కంటే మరింత వేగంగా పనిచేసేలా ఉంటుందట. ఈ కేవైసీ, సొమ్ము విత్డ్రా, క్లెయిమ్ వంటివి మరింత వేగంగా మారనుంది.


జూన్ నెల ప్రారంభం నుంచి కోటక్ మహేంద్ర బ్యాంక్ ఇతర బ్యాంకులలో క్రెడిట్ కార్డులలో మార్పులు తీసుకువస్తోంది. ఆటో డెబిట్ ఫెయిల్ అయితే జరిమాణాలు విధించే అవకాశం ఉన్నదట. అలాగే ఈ కార్డుల ద్వారా ఇంధనం/ యుటిలిటీ చెల్లింపుల పైన చార్జీలు విధించవచ్చు.


ఈ నెల నుంచి ఏటీఎం ద్వారా మనీ డ్రాప్ చేసినట్లు అయితే ఉచిత లావాదేవీల పరిమితిని మించి ట్రాన్సాక్షన్ చేస్తే చార్జీలు పెంపు అమలవుతుంది.


ఇక ప్రతి నెల ఒకటవ తేదీన ఎల్పిజి గ్యాస్ ధరలు తగ్గు లేదా పెరుగుదల ఉండవచ్చు. ఇప్పటికే వాణి గ్యాస్ సిలిండర్ల మీద తగ్గించడం జరిగింది.

బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు రుణాల పైన వడ్డీరేట్లలో మార్పులు.


ఆధార్ కార్డులు ఫ్రీ అప్డేట్స్ సౌకర్యం జూన్ 14- 2025 కు మాత్రమే అందుబాటులో ఉంటుందట.. ఆ తర్వాత చేసుకోవాలి అంటే 25 రూపాయలు వసూలు చేస్తారు.


NPCI ఒక సరికొత్త రూల్ ని ఈరోజు నుంచి అమలులోకి తీసుకువచ్చింది.


రిజర్వ్ బ్యాంక్ అధికారుల సెలవల క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో సుమారుగా 12 రోజులపాటు సెలవులు ఉంటాయట.


కొన్ని క్రెడిట్ కార్డుల విషయంలో విద్యుత్, నీరు మొదలైన వాటిని చెల్లించినట్లు అయితే అదనపు చార్జీలు విధించడం లేదా క్యాష్ బ్యాక్ వంటి నిబంధనలో మార్పులను తీసుకువస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: