
నారా లోకేశ్ కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి విభేధాలు ఉండకూడదని కోరుతున్నారు. కూటమి పార్టీలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే జగన్ సొంత పత్రికలో టీడీపీలో మూకుమ్మడి రాజీనామాలు అంటూ కథనం ప్రచురితం కావడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. వందల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేయడం సంచలనం అవుతోంది.
విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. పార్టీ కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వకపోవడంతో తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయని వాళ్లు చెబుతున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలు పదవులకు రాజీనామా చేయడం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది.
బండారు వర్గానికి, గండి వర్గానికి విబేధాలు నెలకొన్న నేపథ్యంలో లోకేశ్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. చిన్నచిన్న సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఈ తరహా సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు