
అయితే ఇదే సమయంలో నేటి నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షల కోసం హైదరాబాద్ లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. నాన్ లోకల్ కింద 20 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడటానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
అయితే ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షలు పడితే అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు హాజరు కాకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్ కు వెళ్లి పరీక్షలు రాయాల్సి ఉండగా మరి కొందరు ఏపీకి వెళ్లి పరీక్షలు రాయాల్సి ఉంది.
8 రోజుల పాటు రెండు రాష్ట్రాలలో పరీక్షలు జరగనుండగా ప్రధానంగా 20వ తేదీన టెట్ పేపర్1, ఏపీ డీఎస్సీ ఎన్జీటీ పరీక్షలు జరగనున్నాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి రెండు పరీక్షలు ఒకేరోజు జరగకుండా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. తేదీలు మార్చని పక్షంలో టెట్ పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అభ్యర్థులు చెబుతుండటం కొసమెరుపు. రేవంత్, చంద్రబాబు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.