ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయానికి మూడు రాజధానుల నిర్ణయం కూడా ఒక కారణమని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. రాష్ట్రానికి మూడు రాజధానుల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని ప్రజలు భావించారు. మరోవైపు కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రజల్లో వైసీపీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
 
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రాజధాని విషయంలో జగన్ నిర్ణయం సైతం మారిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. వైసిపి కీలక నేతల్లో ఒకరైన జోగి రమేష్ తాజాగా మాట్లాడుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమేనని ఆయన అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల వైసిపి తీవ్రస్థాయిలో నష్టపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల తీర్పు తెలిసిన తర్వాత తాము మూడు రాజధానుల జోలికి వెళ్లాలని భావించడం లేదని ఆయన కామెంట్ చేశారు.
 
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతులపై దాడి చేసి తప్పు చేశామని ఆ విషయం తమకు ఆలస్యంగా అర్థమైందని జోగి రమేష్ అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య గురించి నేతలు చేసిన కామెంట్లు విషయంలో నా భార్య నన్ను ప్రశ్నించింది అని ఆ వ్యాఖ్యలు కూడా వైసిపి ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు.
 
జోగి రమేష్ చేసిన కామెంట్ల విషయంలో వైసిపి అభిమానులు కూడా ఆయన చెప్పింది నిజమేనని రియాక్ట్ అవుతున్నారు. కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటే వైసిపి ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను సాధించకుండా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. జగన్ సైతం కొన్ని విషయాల్లో మారితే భవిష్యత్తులో రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: