ఎప్పుడు ప్రశాంతంగా ఉండే అహ్మదాబాద్  ఎయిర్ పోర్ట్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతి  ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గరలోని  మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం టేకాప్ అయిన కొద్ది నిమిషాలకే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్ధితి అల్లల్కల్లోలంగా మారిపోయింది. వెంటనే అలెర్ట్ అయిన సిబ్బంది ..ఫైర్ ఇంజెన్స్ ని పిలిపించి మటలు ఆర్పేందుకు ట్రై చేస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం విమానంలో  దాదాపు 175 నుంచి 242 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ప్రమాదం లో సుమార్ 100 మంది అక్కడే మరణించిన్నట్లు నేషనల్ మీడియా చెబుతుంది. విమాన ప్రమాదంలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాని కూడా ఇదే ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నారు అంటూ జాతియ మీడియా చెబుతుంది. ఇది వరకు కూడా ఇలాగే గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమాన ప్రమాదాని ఎదురుకున్నారు . విజయ్ రూపానీ 2016 నుండి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఇంకా  ఇద్దరు సినీ స్టార్స్ కూడా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎయిర్ ఇండియా కి చెందిన AI 171 విమానం  అహమ్మదాబాద్ నుంచి లండన్ కి  బయలుదేరింది. ఎప్పటి లాగే టెక్నికల్ గా అన్ని చెక్ చేసుకుని కరెక్ట్ గా క్లీయరెన్స్ వచ్చాకనే టేకాఫ్ అయ్యింది.  కానీ రన్వే పైనుంచి టేక్ ఆఫ్ అయిన  తర్వాత ఆకాశంలో కొద్ది దూరం వెళ్ళాక విమానం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది.  దీంతో విమానం కూలిన పరిసర ప్రాంతాలలో భారీ పేలుడు వల్ల భారీగా పొగలు కొమ్ముకున్నాయి. విమానం వెనుక భాగం చెట్టుని ఢీకొనడం ద్వారానే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు అధికారులు.  దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!



 




మరింత సమాచారం తెలుసుకోండి: