గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కుప్పకూలిపోయిన విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కారణాలు తెరమీద వినిపిస్తున్నాయి.. ఈ విమాన ప్రమాదంలో దాదాపు 242 మంది చనిపోయారు.ఇందులో ఉన్న ఏ ఒక్కరు కూడా బతకలేదు. ఈ చనిపోయిన వారిలో చాలామంది మామూలు జనాలతో పాటు వివిఐపీలు కూడా ఉన్నారు. అలా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం  దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇప్పటికే అహ్మదాబాద్ లో జరిగిన ఈ విమాన ప్రమాదంపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు పెట్టిన వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. 

ఆ వీడియోలో విమాన ప్రమాదం ఎందుకు జరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇంతకీ ఆ నెటీ జన్ పెట్టిన వీడియోలో ఏముంది..విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ విమానంలో ప్రయాణించిన ఓ నెటిజన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక  షాకింగ్ ట్వీట్ చేశారు. అదేంటంటే తాను ప్రయాణించిన ఈ విమానంలో చాలా లోపాలు ఉన్నాయని, ఇందులో డిజిటల్ స్క్రీన్లు, ఏసీలు కూడా పనిచేయడం లేదని, నేను ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి వచ్చానని ఇప్పుడే ఫ్లైట్ లండన్ కి బయలుదేరింది అంటూ వీడియో పెట్టాడు. 

అయితే ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిపోయింది. అయితే  అలా విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు చిత్రీకరించిన వీడియో ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది. దీంతో అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలి పోవడానికి కారణం విమానయాన సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యమేనని, వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వీడియో చూసిన జనాలు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంకొంతమందేమో ఈ వీడియో పోస్ట్ చేసిన నెటిజన్ చాలా లక్కీ అని, తృటిలో చావు నుండి తప్పించుకున్నాడని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: