సినీ పరిశ్రమకు, పొలిటికల్ కు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు పొలిటికల్ పార్టీలకు సపోర్టు చేస్తూ మరికొంతమంది పొలిటికల్ గా కూడా ఎంట్రీ చేస్తూ సక్సెస్ అయిన వారు ఉన్నారు. అయితే తాజాగా బిజెపిలోకి ఎవరైనా వస్తారు అంటే కచ్చితంగా తాము ఆహ్వానిస్తామంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన మనసులో మాటని తెలియజేశారు. అయితే తన మాటను టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవిని కాదనరనే ఉద్దేశించే చేసినట్లుగా తెలుస్తోంది.


ఈ రోజున ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను చాలా మంది సినీ సెలబ్రిటీలతో బీజేపీ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయని ముఖ్యంగా విజయశాంతి, కృష్ణంరాజు, నరేష్, సుమన్, కోటా శ్రీనివాసరావు వంటి వారు పార్టీలో పని చేశారని తెలియజేశారు. వారిలో కొంతమంది పార్టీలో చేరి మంత్రులుగా కూడా అయ్యారని మరి కొంతమంది తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని తెలిపారు. మాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా.. ఎవరు బిజెపి కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నట్టుగా మాట్లాడారు వారందరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదంటూ ఫైర్ అయ్యారు.


బిజెపి పార్టీ ఎప్పుడూ కూడా అవినీతి రాజకీయాల పైన పోరాటం చేస్తుంది అంటు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి బిజెపి పార్టీ ఎప్పుడు సహకరిస్తూ ఉంటుందని. హైదరాబాద్ మెట్రో నెక్స్ట్ పేజీకి కేంద్రం సహకరిస్తుంది అంటూ తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాబోయే ఎన్నికలలో కూడా బిజెపి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ తెలియజేశారు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారంటూ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చిరంజీవి తమ పార్టీ నాయకుడే అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి మరి ఇలాంటి సందర్భంలో బిజెపి నేత చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఈ మధ్యకాలంలో తరచూ పొలిటికల్గా చిరంజీవి పేరు వినిపిస్తున్న తరుణంలో మరియు ఈ విషయంపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: