
ఉదయం 11 గంటలకు ఈ సమావేశం మొదలు కావాల్సి ఉండగా ఆ సమయానికి మీటింగ్ హాల్లో వైసిపి పార్టీకి చెందిన మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లు అక్కడికి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాత్రమే వచ్చి తమ చైర్లో కూర్చోవడం జరిగింది. మరొకవైపుగా మేయర్ తో పాటు 38 వైసీపీ కార్పొరేటర్లతో ఛాంబర్ లో సమావేశమై తమకు తెలియకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడం పైన సురేష్ బాబు అభ్యంతరాన్ని తెలియజేయడం జరిగింది.
మీటింగ్ హాల్లో కాకుండా తన చాంబర్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కమీషనర్ కి లేఖ రాశారు.. దీంతో నిబంధనలకు విరుద్ధంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే మాధవి రెడ్డితో పాటుగా టిడిపి కార్పోరేటర్లు సైతం మేయర్ సురేష్ బాబుని ప్రశ్నిస్తున్నారు. దీంతో అటు ఎమ్మెల్యేలు, ఇటు మేయర్ తో అధికారులు చర్చలు జరిపేలా చూస్తున్నారట. ఇప్పటికే కడపలో అటు మేయర్, ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ విషయం పైన అధికారులు ఎవరికీ ఎవరు సర్ది చెబుతారో చూడాలి మరి.