ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా పలు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల ఫలితం ఎలా ఉన్నా టీడీపీ గురించి కొంతమేర నెగిటివ్ చేసే విషయంలో వైసీపీ పూర్తిస్థాయిలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా సినిమాలు తెరకెక్కే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ కు వ్యతిరేకంగా రాజధాని ఫైల్స్ పేరుతో ఒక సినిమా తెరకెక్కింది.

టీడీపీకి  వ్యతిరేకంగా  తెరకెక్కిన సినిమాలకు సంబంధించి కొన్ని కేసులు సైతం నమోదైన సంగతి తెలిసిందే.   ఐతే  2024 ఎన్నికల్లో  వైసీపీకి  వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి.  హిట్ టాక్ వచ్చిన సినిమాలనే ప్రజలు పట్టించుకునే పరిస్థితి అయితే  లేదు. ఇలాంటి సమయంలో  జగన్ ను టార్గెట్  చేసి సినిమాలను తెరకెక్కించినా  ఆ సినిమాల  వల్ల  పెద్దగా  ఒరిగేదేమీ ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ పెద్దలు జగన్ కు  వ్యతిరేకంగా సినిమాలకు  అంగీకరిస్తే  ప్రభుత్వం నుంచి ఫండింగ్ వస్తుందని నిర్మాతల ఆలోచన అని సమాచారం అందుతోంది.  జగన్  గతంలో చేసిన తప్పులను హైలెట్ చేసేలా  సినిమాలను తెరకెక్కించే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా ఎక్కువ సినిమాలను  తెరకెక్కించాలని  కొంతమంది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే  ఎపి  ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఏ  విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.   ఒకవేళ జగన్ కు వ్యతిరేకంగా సినిమాలు తీస్తే ఆ సినిమాలకు సంబంధించి వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే చర్చ సైతం జరుగుతోంది.  జగన్ మాత్రం  ఇలాంటి విషయాలను పట్టించుకునే పరిస్థితి అయితే  లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో జగన్ రాజకీయంగా మరిన్ని సంచలనాలను సృస్తిన్చాలని అతని ఫ్యాన్స్  కోరుకుంటున్నారు. జగన్ మాత్రం ప్రజల్లో ప్రస్తుతం వస్తున్నా స్పందన విషయంలో సంతోషంగానే ఉన్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: