
ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ మృతి విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ మరణం తర్వాత పూర్ణచందర్ ఫోన్ స్విచాఫ్ కావడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. పూర్ణచందర్ పోలీసుల ముందు లొంగిపోవడం ఒకింత సంచలనం అవుతోంది.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పూర్ణచందర్ లాయర్ తో కలిసి వఛ్చి పోలీసుల ముందు తన స్టేట్ మెంట్ ఇచ్చారు. పూర్ణచంద్ర రావు రిలీజ్ చేసిన లేఖ సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. పూర్ణచందర్ ఆ లేఖలో స్వేఛ్చతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. 2008లో స్వేచ్ఛకు మొదటి వివాహం జరిగిందని 2016లో సెకండ్ మ్యారేజ్ జరిగిందని రెండుసార్లు ఆమె విడాకులు తీసుకున్నారని వెల్లడించారు.
రెండో వివాహం ద్వారా స్వేచ్చకు పాప పుట్టిందని 2020 సంవత్సరం నుంచి పాప నాకు దగ్గరైందని ఆయన అన్నారు. 2022 సంవత్సరం నుంచి పాప బాధ్యతను పూర్తిగా తానె తీసుకున్నారని ఆయన తెలిపారు. అయితే స్వేచ్ఛ కూతురు మాట్లాడుతూ పూర్ణచందర్ ఎదో చేసి మా అమ్మను రెచ్చగొట్టాడని అన్నారు. ఆ వ్యక్తి రెగ్యులర్ గానే మా ఇంటికి వచ్చేవాడని ఆ చిన్నారి పేర్కొన్నారు.
ఆ వ్యక్తి మా అమ్మతో క్లోజ్ గా ఉండేవాడని కానీ అంత మంచోడు కాదని నాకు అనిపించేదని ఆ చిన్నారి కామెంట్లు చేశారు. పూర్ణచందర్ మాటలను అమ్మ ఎక్కువగా నమ్మేసిందని ప్రేమ ఉన్నోడైతే అమ్మను చూడటానికి ఆ వ్యక్తి రావాలి కదా అని చిన్నారి కామెంట్లు చేశారు. ఈ కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు