ఏ ప్రాంతంలో ఉన్న హిందువులందరూ కూడా భగవద్గీత ని చాలా భక్తితోనే కొలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి భగవద్గీత మీద  కొంతమంది కావాలని ఈ మధ్యకాలంలో కించపరిచే విధంగా విమర్శలు చేస్తూ ఉండడమే కాకుండా పలు రకాల పనులు చేస్తున్నారు.ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగినట్లు తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.


హిందుత్వం మీద దేశ ద్వేషాన్ని ప్రోజెక్ట్ చేయడం కోసం ప్రత్యేకించి మరి కొంతమంది సోషల్ మీడియాని ఉపయోగించు కొని మరి చేస్తున్నారు.. వాళ్ళ యొక్క అహంకారపూరితమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా సాహిల్ పఠాన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి భగవద్గీత ని అలాగే, జాతీయ పతాకాన్ని తొక్కేస్తున్న విజువల్ ని ప్రత్యేకించి ఆన్లైన్లో పెట్టిన సంఘటన సంచలనగా మారింది.. అంతేకాకుండా ఆ సంఘటనను  లైవ్ చూపెడుతూ నాకు ఈ దేశం పట్ల రెస్పెక్ట్ లేదు.. దీని మీద నాకు పూర్తి వ్యతిరేకత ఉంది అంటూ.. అలాగే ఈ వ్యవహారంలో తాను చేస్తున్నది కరెక్టేనా  అంటూ పబ్లిక్ కి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధ్వంశాన్ని చేసుకొచ్చారట.


అయితే ఆ విజువల్స్ ని లైవ్ లో ప్రొజెక్ట్  చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇలా చేసినటువంటి వారి మీద చర్యలు తీసుకుంటారా ?లేదా? అన్నటువంటి విషయాన్ని పబ్లిక్ గానే సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు. దీంతో  ఇప్పుడు మధ్యప్రదేశ్  ప్రభుత్వం ఏం చేస్తుందన్నటువంటిది హాట్ టాపిక్ గా మారుతున్నది. అయితే ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. సనాతన ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న బిజెపి పార్టీ మరి ఇలాంటివి సహిస్తుందా అన్నది చూడాలి..అయితే ఇలాంటి కావాలని రెచ్చగొట్టు చర్యలు చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కువగా పెరుగుతున్నది. ఇక మీదట ఇలాంటివి జరగకుండా కేంద్రం ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: