
శిధిలాలు తొలగింపు జరుగుతోందని వాటికింద మరి కొంతమంది ఉండొచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ పేలుడు దాటికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు కూడా కుప్పకూలిపోయిందని రెండు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఈ ప్రమాదం పెద్దదే అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ సంఘటన వద్ద హైడ్రాస్ ఇబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సైతం మూడు గంటల పాటు శిదిలాలను తొలగిస్తూ అక్కడే ఉన్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రులు సైతం హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ జిల్లా యంత్రాంగంతో అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి తెలియజేశారు.ఈ ప్రమాదంలో కార్మికులు కూడా తీవ్రంగా గాయపడ్డారని మంత్రి వివేక్ తెలియజేశారు. ఈ పేలుడు ఎలా జరిగింది అనే విషయం పైన కూడా ఎంక్వయిరీ చేస్తున్నామంటూ తెలియజేశారు. ఈ సంఘటన ఎవరు చేసినా కూడా బాధ్యుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి తెలియజేశారు. ప్రమాద బాధితులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వెల్లడించారు. ముఖ్యంగా కార్మికుల మొబైల్స్ పనిచేయకపోవడంతో చాలామంది కుటుంబ సభ్యులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి అధికారులు మరణించిన వారి పేర్లు ఇంకా ప్రకటించలేదు.