- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా సంబంధిత కేసుల్లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ల కు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది . రిమాండ్ విధించే విషయం లో అత్యంత జాగ్రత్త గా ఉండాలని , సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్నేష్ కుమార్ తీర్పు మరియు ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తీర్పు ను తప్పనిసరి గా పాటించాలన్నది ఈ సర్కులర్ సారాంశం . ప్రాథమిక విచారణ తప్పనిసరి .. ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తీర్పు ను ఉదహరిస్తూ, హైకోర్టు పేర్కొన్నది ఏమిటంటే – ప్రసంగాలు , రచనలు , కళాత్మక వ్యక్తీకరణ కు సంబంధించిన కేసుల్లో 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉండే నేరాల్లో FIR నమోదు చేయడానికే ముందుగా ప్రాథమిక విచారణ జరపాల్సి ఉంటుంద ని స్పష్టం చేసింది .



అలాగే ఈ విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి అనుమతితో మాత్రమే చేయాలని , అలాగే 14 రోజుల్లో విచారణ పూర్తిచేయాలి అని నిర్దేశించింది. అరెస్టు ఆటోమెటిక్ కాదు ... ఆర్నేష్ కుమార్ తీర్పు లో పేర్కొన్నట్టు, 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న నేరాల్లో ఆటోమెటిక్ గా అరెస్టు చేయకూడదు . పోలీసులు అరెస్టు చేయాలను కుంటే , అదుకే గల సరైన కారణాల ను రికార్డ్ చేయాలి . ఈ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలి ఈ మార్గదర్శకాల ను ఉల్లంఘించిన మేజిస్ట్రేట్‌ల పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామ ని హైకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: