మన భారతదేశంలో ఎవరైనా వ్యక్తి చనిపోయినట్లయితే వారి సెంటిమెంట్స్ ప్రకారం మరియు వారి ఆచారాల ప్రకారం చనిపోయిన వారి అస్థికలను కొంతమంది గంగలో కలుపుతారు. మరి కొంతమంది గోదావరి లో కలుపుతారు. మరి కొంత మంది మరి కొన్ని పద్ధతులను పాటిస్తా ఉంటారు. ఇక తాజాగా ఓ దేశం వారు ఆస్తికలను కలిపే విషయంలో ఓ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. కానీ ఆ ప్రయోగం ఆదిలోనే విఫలం అయింది. ఇంతకు ఆ ప్రయోగం ఏమిటి ..? ఆ ప్రయోగాన్ని ఏ దేశం వారు చూపెట్టారు ..? అనే వివరాలను తెలుసుకుందాం.
జర్మనీకి చెందిన ది ఎక్స్ప్లనేషన్ అనే స్టార్టర్ కంపెనీ అంతరిక్షంలో ఎవరైనా ఆస్తులు కలపాలి అనుకుంటే వారి దగ్గర నుండి అస్థికాలను తీసుకోని అంతరిక్షంలో కలపడానికి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. జర్మనీకి చెందిన ది ఎక్స్ప్లనేషన్ అనే స్టార్టర్ కంపెనీ మిషన్ ఇంపాజిబుల్ అనే పేరుతో చనిపోయిన వారి అస్థికలను అంతరిక్షంలో కలిపే పనిని చేపట్టింది. Nyx క్యాపసూన్ ను అభివృద్ధి చేసి జూన్ 23 వ తేదీన నింగిలోకి ప్రయాణించింది. ఇక వీరు 166 మంది అస్థికలతో పాటు కొన్ని విత్తనాలను మరియు ఇతర సామాగ్రిని పంపించింది. టెక్సాస్ కు సంబంధించిన స్పేస్ బరియల్ కంపెనీ సెలెస్టిన్ తో కలిసి జర్మనీ సంస్థ దీనిని చేపట్టింది. ప్రయోగంలో భాగంగా ఈ క్యాపసూన్ రెండు కక్షలను పూర్తి చేసింది. తిరిగి భూ వాతావరణం లోకి వచ్చే సమయంలో ప్రయోగ కేంద్రంతో సంబంధాలను కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సమయానికే క్యాపసూన్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కంపెనీ ప్రకటించింది.
అలాగే ప్రమాదానికి కల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా అస్థికలు పంపించిన కుటుంబాలకు పంపిణీ క్షమాపణలు చెప్పింది. కొత్త లక్ష్యాలు , వినూత్న అజెండాతో మేము చేపట్టిన ప్రయోగం పాక్షికంగా విజయవంతం సాధించింది. కానీ అనుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయాం. ప్రమాదం ప్రమాదం కారణంగా అస్థికలన్ని సముద్రంలో కాలసిపోయాయి. దానితో వాటిని రికవరీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అందుకు మా క్లైంట్లకు స్వారీ చెప్తున్నామని ఈ కంపెనీ చెప్పుకొచ్చింది.