
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేయాల్సిన అవసరం ఏంటి..? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని.. కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నారు అనేది ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సుదాన్షు దుల్ఫియ ప్రశ్నించారు. "ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులేదు. ఇక్కడ సమస్య అంతా కూడా మీరు చేపడుతున్న సమయమే . ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా ఒక వ్యక్తి ఓటు కోల్పోతే దాని గురించి అడిగేందుకు సదరు వ్యక్తికి సమయం ఉండదు . ఒకసారి ఓటర్లు జాబితా ఖరారు అయిన తర్వాత కోర్టులు ఆ అంశం వైపు చూడకూడదు.. అసలు వాటి జోలికి వెళ్ళకూడదు ..ఓటు కోల్పోయిన వ్యక్తి ఎన్నికల ముందు ఆ సవరించన జాబితాను సవాల్ చేసేందుకు అసలు ఛాన్స్ ఉండదు . ఇలాంటి ప్రక్రియతో మన దేశ పౌరులు కి వారికి ఆ జాబితాలో చోటు ఉండదు. ఇది రాజ్యాంగబద్ధమే అయినప్పటికీ మీరు ఈ సవరణ నిర్వహిస్తున్న సమయం మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. దీనిని ఎన్నికలతో సంబంధం లేకుండా వేరుగా నిర్వహించాలి" అంటూ ధర్మశాసనం వ్యాఖ్యానించింది .
ఈ ప్రక్రియ ECI పరిధికి పూర్తిగా మించినది: కపిల్ సిబల్
1950 తర్వాత భారతదేశంలో జన్మించిన ఎవరైనా చట్టబద్ధంగా పౌరులుగా పరిగణించబడతారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఎవరైనా దానిని ప్రశ్నించాలనుకుంటే, వారు ముందుగా ఆ వ్యక్తి పౌరుడు కాదని చూపించే రుజువు లేదా సమాచారాన్ని అందించాలి. ఈ కొత్త ఓటరు జాబితా సవరణ వలసదారులను కూడా అన్యాయంగా ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. ఎందుకంటే వారు ఒక ఫారమ్ నింపడానికి వారి స్వరాష్ట్రానికి తిరిగి రావాలని అడుగుతున్నారు. ముఖ్యంగా అలాంటి రికార్డులు కూడా లేనప్పుడు, ప్రజలు తమ తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాల వంటి పత్రాలను ఎలా పొందాలని..? ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రక్రియ భారత ఎన్నికల కమిషన్ చేయడానికి అనుమతించబడిన దానికంటే ఎక్కువగా ఉంటుందని సిబల్ గట్టిగా వాదించారు.
ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ పేరుతో పేద ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన కూడా చేపట్టాయి. ఓటర్ల జాబితా సవరణ సమయంలో.. ప్రజల వద్ద ఉన్న ఆధార్, రేషన్ కార్డు, ఓటరు కార్డులను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పూర్తిగా స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ఓటర్లను రీవెరిఫై చేసే సమయంలో ఖచ్చితంగా ఈ మూడు కార్డులను గుర్తింపుగా తీసుకోవాలని కోర్టు సూచించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై స్టే విధించే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది. జూలై 28వ తేదీన మళ్లీ ఈ కేసులో విచారణ జరగనున్నది.