జనసేన పార్టీ సీనియర్ నేతకు తాజాగా అధిష్టానం ఒక సడన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేన ఇన్చార్జి పదవ నుంచి తప్పించి మరి కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆ జనసేన పార్టీ నేత కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ మాజీ ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంకి చెందిన జనసేన పార్టీ ఇన్చార్జి టీవీ రామారావు తాజాగా తప్పించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి జనసేన అధికారిక ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ కూడా వైరల్ గా మారుతున్నది.



పార్టీ క్లాఫిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. పార్టీ విధివిధానాలను భిన్నంగా మీరు చేసేటువంటి వ్యాఖ్యలు కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేస్తూ ఉండడంతో ఇవి పార్టీ దృష్టికి వచ్చాయని కూటమి స్నేహానికి విఘాతం కలిగించేలా మీ చర్యలు ఉన్నందువలన మిమ్మల్ని పార్టీ నుంచి ఇన్చార్జిగా బాధ్యతలను తప్పిస్తున్నామంటూ తెలియజేయడం జరిగింది. పార్టీ నిర్ణయం మేరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ తెలియజేశారు.


అయితే అంతకుముందే టీవీ రామారావు కూడా  ట్విట్  నీ తెలియజేస్తూ.. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఉన్నందుకు తనకు తగిన గౌరవం ప్రాధాన్యత లభించలేదని తెలియజేశారు. సొసైటీలు, ఏఎంసీ కమిటీలు ఏర్పాటులో కూడా జనసేన కార్యకర్తలను నాయకులను అసలు పరిగణంలోకి తీసుకోకుండా ఉండడం చాలా బాధాకరంగా ఉందని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ ఎల్లప్పుడు సమైక్యతను కట్టుబడి ఉన్నదని కానీ టిడిపి పార్టీ నుంచి ఈ పొత్తు గౌరవించే విధంగా కనిపించకపోవడం బాదేస్తోంది అంటూ తెలియజేశారు. ఈ విషయాన్ని అటు కూటమి అధిష్టానం వైపుగా తీసుకువెళ్లగా.. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా ఫలితాలు విభిన్నంగా వచ్చే అవకాశం ఉంటుందని భావించిన నేతలు జనసేన నేతను సస్పెండ్ చేశారు. టీవీ రామారావు కూడా కొవ్వూరు టోల్ గేట్ వద్ద ర్యాలీ నిర్వహించడంతో పార్టీ వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో పార్టీ నుంచి తప్పించారు. మరి పార్టీ కొత్త ఇన్చార్జిగా ఎవరిని నియమిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: