
హిందీ నేర్చుకోవడం మన సాంస్కృతిక ఉనికిని కోల్పోవడం కాదని, అది మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణ భారత సినిమాల్లో 31 శాతం హిందీలో డబ్ అవుతున్నాయని, వ్యాపార రంగంలో హిందీ కీలకమైన అవసరమని ఆయన వివరించారు. వ్యాపారం కోసం హిందీ అవసరమైతే, మాట్లాడటానికి ఎందుకు వద్దని ఆయన ప్రశ్నించారు.హిందీని అంగీకరించడం ఓటమి కాదని, అది ఐక్యతతో కలిసి ప్రయాణించడమని పవన్ స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో హిందీపై ఉన్న సెంటిమెంట్‌ను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. హిందీ నేర్చుకోవడం ద్వారా యువతకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని, దేశ ఆర్థిక, సామాజిక వృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు దక్షిణాదిలో భాషా సమస్యపై కొత్త చర్చకు దారితీయవచ్చని భావిస్తున్నారు.పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో హిందీ భాష పాత్రపై ఆలోచనలను రేకెత్తించాయి. హిందీని వ్యతిరేకించే ధోరణి రాబోయే తరాలకు ఆటంకం కావచ్చని ఆయన హెచ్చరించారు. భాషలను కలుపుకుని ముందుకు సాగడం ద్వారా దేశ ఐక్యతను బలోపేతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై దక్షిణ రాష్ట్రాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పవన్ వాదన కొత్త దృక్పథాన్ని అందించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు