
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు .. మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కు మంత్రి పదవి యోగం ఉందా ? లేదా ? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొణతాల ఒకప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ .. 2004లో ఆయన కాంగ్రెస్ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ ఐదేళ్లు రామకృష్ణ ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పారు. రాజకీయంగా చెప్పాలంటే ఆయన కెరీర్ లోనే అది స్వర్ణయుగం. ఓ వెలుగు వెలిగిపోయారు. ఆ ఐదేళ్లు వైఎస్ ప్రోత్సాహం కూడా ఉండడంతో ఆయన ఏం చెపితే విశాఖ జిల్లాలో అదే నడిచింది. అయితే 2009లో ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనకు రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి.
2004 తర్వాత మళ్లీ ఆయన గెలుపు రుచి చూసింది 2024 ఎన్నికల్లో నే కావడం విశేషం. ఇక మొన్న ఎన్నికల్లో కూడా ఆయన రాజకీయంగా ఇదే తనకు చివరి ఛాన్స్ అని చెప్పి మరీ పోటీ చేసి రెండు దశాబ్దాల తర్వాత అనకాపల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అయితే మరోసారి తనకు బీసీ కోటాలో సీనియర్ కోటాలో మంత్రి పదవి వస్తుందని కలలు కన్నారు. జనసేన పార్టీకి కేవలం మూడు పదవులే రావడంతో ఆ కోరిక తీరలేదు. త్వరలోనే మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయన్న ప్రచారంతో పాటు జనసేనకు మరో మంత్రి పదవి వస్తుందని అంటున్నారు. మరి ఈ సారి అయినా కొణాతాల కోరిక తీరుతుందేమో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు