
ఇంతలో ఈ ఘటన వెనుక కుట్ర ఉందా? అనే కోణంలో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమీపంలో ఇలా జరిగే సంఘటనలు సాధారణంగా ఉండవని, ఇది కావాలని జరిగిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఓ స్థాయి మద్దతు ఏర్పడుతున్న వేళ ఈ ప్రమాదం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. 2024 అక్టోబర్ 2న "జన్ సూరజ్" పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్, ఆ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను నాలుగు విడతలుగా ప్రకటించబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మొదటి విడతగా 40 రిజర్వ్ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.ఇక అసలు ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
ఇప్పటిదాకా పలు రాష్ట్రాల్లో వ్యూహకర్తగా విజయాలు అందించిన ఆయన… స్వయంగా రాజకీయ రంగప్రవేశం చేసి 243 నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఏకైక అరుదైన విషయంలో ఒకటిగా నిలుస్తోంది. ఇటీవల నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జరిగిన ప్రమాదంతో ఆయన మీద ప్రజల్లో మరింత సానుభూతి కలగొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీ-జేడీయూ కూటమి, మహాఘట్ బంధన్ పక్షాలు కూడా ప్రశాంత్ ఫ్యాక్టర్‌ను ఎలా ఎదుర్కోవాలా అన్న ఆలోచనలో ఉన్నాయట. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నా… ఈ ఘటనతో బీహార్ రాజకీయాలు మరింత ఉద్విగ్నంగా మారాయి. రాబోయే రోజుల్లో ప్రశాంత్ హస్తం ఎంత మేర ప్రజలను ఆకర్షిస్తుందో, ఆయన రాజకీయ పయనం ఏవిధంగా మలుపుతిప్పుతుందో చూడాలి