
బంగ్లాదేశ్ ఎయిర్ పోర్సుకు చెందినటువంటి F-7 BGI శిక్షణ విమానం ఒక స్కూల్ భవనం పైన కూలిపోవడం జరిగింది. ఈ సంఘటన మధ్యాహ్నం 1:06 నిమిషాలలో జరిగినట్లుగా సమాచారం. మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ డయాబరి క్యాంపస్ లో ఒక భవనం పైన ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం కూలిన వెంటనే ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయని అందుకు సంబంధించి వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
అయితే అక్కడ స్థానిక మీడియా నివేదికల ప్రకారం 10 మంది మరణించి ఉండవచ్చని విద్యార్థులతో పాటు మరి కొంతమంది గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు ,ఫైర్ సిబ్బంది , అంబులెన్స్ లు ఘటన స్థలానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ తదితర బృందాలు సహాయక చర్యలు కూడా అక్కడ ఇప్పటికి చర్యలను కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మంటలను అదుపులోకి చేయడానికి తీవ్రంగా అక్కడ రక్షణ సిబ్బంది పని చేస్తోంది. మరి ఈ ప్రమాదానికి గల కారణాలను ఇంకా అధికారులు అధికారికంగా ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. విమాన పైలెట్ పరిస్థితి పై ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. మరి కొన్ని గంటలలో ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.