ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తాం అని ప్రభుత్వం గత కొంత కాలంగా చెబుతూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ పథకం విషయంలో ప్రభుత్వం తాజాగా కాస్త ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అసలు విషయం లోకి వెళితే. ... తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి మడిపల్లి రాం ప్రసాద్ మాట్లాడుతూ. ... ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెడతాం అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని మొదలు పెట్టినట్లయితే అది ఆటోలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి ఎంతో కష్టం అవుతుంది.

అలాగే ఆటోలపై ఆధారపడి జీవించే వారు తమ జీవనాన్ని అంత సంతోషంగా గడపలేరు అనే అభిప్రాయాలు బయటకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. దీనిపై కూడా మంత్రి స్పందిస్తూ ... మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయాన్ని తీసుకువచ్చిన వెంటనే ఆటోల మీద ఆధారపడి జీవించే వారికి కూడా మంచి జరిగేలా విధి విధానాలను రూపొందిస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మరికొన్ని రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు కు సంబంధించిన నమూనా బస్సు ను కూడా తీసుకువస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పథకం కోసం ఆర్టీసీ సంస్థ 1400 బస్సులను కూడా కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.

అలాగే జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు కూడా ఆయన ఈ సమావేశంలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తున్నాం అనగానే ఎక్కువ శాతం మంది జనాలు అది ఆటోలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అని అనేక మంది అభిప్రాయ పడ్డారు. మరి ఆటోలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించే వారికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: