
ఏఐ వల్ల కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్ జాబ్స్ కోల్పోయే ఛాన్స్ ఉంది. ఏఐ టూల్స్ రియల్ టైమ్ సంభాషణలు చేసే అవకాశం ఉండటంతో ఈ విభాగాల్లో మనుషుల అవసరం తగ్గినట్టేనని తెలుస్తోంది. డేటా ఎంట్రీ జాబ్స్, ట్రాన్స్‌క్రిప్షన్, రికార్డు కీపింగ్ లాంటి ఉద్యోగాలు సైతం త్వరలో తెరమరుగయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి తప్పులు లేకుండా సులువుగా ఈ పనులు చేస్తుంది.
ఎంట్రీ లెవెల్ కోడింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్స్ సైతం ఏఐ వల్ల రిస్క్ లో పడినట్టేనని తెలుస్తోంది. ఇప్పటికే న్న చిన్న స్క్రిప్ట్‌లను రాయడం, డీబగ్గింగ్ వంటి పనులు ఏఐ ద్వారా సులువుగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది న్యాయశాస్త్రం, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ విభాగాలలో సైతం ఏఐ వినియోగం పెరిగిందని సమాచారం అందుతోంది. కంటెంట్ క్రియేషన్‌పై కూడా ఏఐ ప్రభావం పెరుగుతోందని తెలుస్తోంది.
ఈ మార్పులకు అనుగుణంగా విద్యావిధానం, ప్రభుత్వ విధానాల్లో సైతం మార్పులు రావాలని సమాచారం అందుతోంది. ఏఐతో కొన్ని జాబ్స్ పోయినా కొత్త నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు మాత్రం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం ద్వారా ఈ సమస్యలను కొంతమేర అధిగమించవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు